Daniel Vettori: “క్రమశిక్షణ లేదు.. లెంగ్త్ అసలే లేదు.. ఓటమికి కారణం ఇదే”.. SRH బౌలర్లపై కోచ్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daniel Vettori: ఐపీఎల్ తొలి పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పరాజయం పాలైంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయం సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్దేశించిన 202 పరుగులు లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ అంశంపై తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి నిర్మొహమాటంగా స్పందించారు. బౌలింగ్‌లో క్రమశిక్షణ లేదని.. లెంగ్త్ అసలే లేదన్నారు. “ఈ మ్యాచ్‌లో మా జట్టు బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. బౌలింగ్‌లో క్రమశిక్షణ లేదు. అందుకే ఓటమి పాలయ్యాం. ఫిలిప్ సాల్ట్ వికెట్‌ను త్వరగానే పడగొట్టగలిగాం. కానీ.. విరాట్, పడిక్కల్‌లు ఈజీగా రన్స్ చేసేలా అవకాశం ఇచ్చాం. ఆర్సీబీ జట్టు బాగా ఆడింది. కానీ.. మా జట్టు బౌలర్లు సరైన లెంగ్త్‌లో బాల్స్ వేయలేకపోవడంతోనే రన్స్ వచ్చాయి.” అని వివరించారు.
READ MORE: Raghavendra Rao: శ్రీదేవి మరణంపై రాఘవేంద్రరావు సెన్సేషనల్ కామెంట్స్!
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
చిన్నస్వామి స్టేడియం లాంటి ఫ్లాట్ పిచ్‌పై తాము చేసిన 201 పరుగులు ఏమాత్రం సరిపోవని కోచ్ వెట్టోరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకప్పుడు 200 మార్క్ దాటితే సురక్షితంగా భావించే వాళ్లాం. ఇంత స్కోర్ చేస్తే మ్యాచ్ గెలుస్తామని ధీమాగా ఉండే వాళ్లం. కానీ ప్రస్తుతం ఐపీఎల్‌లో పరిస్థితులు మారిపోయాయన్నారు. “ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. అలాంటి టీమ్ ముందు ఈ స్కోరును ఛేజ్ చేయకుండా నిలువరించడం చాలా కష్టం. ఈ విషయాన్ని నేను ముందే ఊహించాను. ఇక మా టీమ్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి ఓపెనర్లు త్వరగా అవుట్ కావడం టీమ్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ చివర్లో అనికేత్ వర్మ అద్భుతంగా ఆడారు. వీళ్ల వల్లే కనీసం ఈ స్కోర్ చేయగలిగాం. ప్రతి మ్యాచ్‌లోనూ ఓపెనర్లే ఆడాలని అనుకోలేం. మా బ్యాటింగ్ లైనప్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది.” అని తెలిపారు. ఇక ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి తీవ్రంగా విమర్శించారు. ఆర్‌సీబీ బౌలర్ జాకబ్ డఫ్ఫీ ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి వికెట్లు తీశాడో చూసి కూడా తమ బౌలర్లు నేర్చుకోవాలన్నారు. మ్యాచ్ చివర్లో మళ్ళీ గాడిలో పడి వికెట్లు తీసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అన్నారు. అయితే యువ బౌలర్లు డేవిడ్ పేన్, హర్ష్ దూబే రాబోయే మ్యాచ్‌ల్లో పుంజుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!