Site icon NTV Telugu

IND vs AUS: సచిన్ క్లబ్ లో చేరిన విరాట్ కోహ్లీ

Virat Kohli

Virat Kohli

IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. భారత గడ్డపై కోహ్లికి ఇది 50వ టెస్టు మ్యాచ్. ఈ ఘనత సాధించిన 13వ ఆటగాడిగా కూడా నిలిచాడు. భారత జట్టు తమ గడ్డపై 50 టెస్టు మ్యాచ్‌లు ఆడడం పెద్ద విషయం. ఇప్పటి వరకు 12 మంది భారత ఆటగాళ్లు అలాంటి ఘనత సాధించారు. అందులో గ్రేట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ చేరారు. భారత్‌లో 94 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఇందులో కూడా అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత భారత్‌లో 70 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్ పేరు ఉంది. ప్రస్తుత భారత జట్టు ఆటగాళ్లు చెతేశ్వర్‌ పుజారా, అశ్విన్‌లు కూడా ఈ జాబితాలో చేరారు.

తమ గడ్డపై అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లు
సచిన్ టెండూల్కర్ – 94
రాహుల్ ద్రవిడ్ – 70
సునీల్ గవాస్కర్ – 65
కపిల్ దేవ్ – 65
అనిల్ కుంబ్లే – 63
వీవీఎస్ లక్ష్మణ్ – 57
ఆర్ అశ్విన్ – 55*
హర్భజన్ సింగ్ – 55
దిలీప్ వెంగ్‌సర్కార్ – 54
వీరేంద్ర సెహ్వాగ్ – 52
చెతేశ్వర్ పుజారా – 51
సౌరవ్ గంగూలీ – 50
విరాట్ కోహ్లీ – 50*

Exit mobile version