NTV Telugu Site icon

Virat Kohli: ‘నీ మనసుకు మార్గం తెలుసు’.. కోహ్లీ పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో గందరగోళం!

Ko1

Ko1

ప్రస్తుతం ఆధ్యాత్మక పర్యటనతో బిజీగా ఉన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి లభించగా. భార్య అనుష్క, కూతురు వామికాతో రిషికేశ్‌లోని ఆశ్రమంలో గడిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఇంకో వారం రోజుల సమయం ఉంది. ఈ సమయంలోనే కోహ్లీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అది కాస్త మోటివేషన్‌లా ఉండటంతో కోహ్లీ ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడని ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు. కెరీర్‌కు సంబంధించి ఏదైన కఠిన నిర్ణయం తీసుకోబోతున్నాడా అని ఆందోళన చెందుతున్నారు.

Also Read: FedEx Layoffs: ఉద్యోగులకు ఫెడ్‌ఎక్స్ షాక్..తామూ ఆ దారిలోనే అంటూ!

“నువ్వు వెళ్లే మార్గం నీ మనసుకు తెలుసు. అదే దిశలో పరుగెత్తు” అని విరాట్ కోహ్లీ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీని అభిమానులు పెద్ద సంఖ్యలో షేర్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో అభిమానుల మధ్య చర్చకు తెరతీసింది. కొందరేమో విశ్రాంతి సమయంలో విరాట్ కార్యక్రమాల గురించి చెబుతున్నాడని అంటుండగా.. మరికొందరేమో క్రికెట్‌ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటాడనే కామెంట్లూ చేశారు. అయితే, కోహ్లీ మాత్రం ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టుపై మంచి రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ.. అదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి టెస్టు సిరీస్‌ మొదలుకానుంది.