రవిచంద్రన్ అశ్విన్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. గబ్బా టెస్టు మ్యాచ్ తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ రిటైర్మెంట్ వార్త విన్న విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఇద్దరు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొన్నారు.. ఈ సమయంలో అశ్విన్ విరాట్‌తో ఏదో చెప్పాడు. ఆ తర్వాత కోహ్లీ అతన్ని కౌగిలించుకోవడం కనిపించింది. రీటైర్మెంట్ ప్రకటనకు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీకి తన రిటైర్మెంట్ గురించి చెబుతూ భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. అశ్విన్ రిటైర్మెంట్‌పై విరాట్ ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు.
READ MORE: Konakalla Narayana Rao: డబ్బులు కట్టినా.. పేర్ని నాని కేసు తప్పించుకోలేరు!
“14 ఏళ్ల పాటు నీతో కలిసి ఆడా. ఈరోజు రిటైర్మెంట్ గురించి నాతో చెబుతుంటే.. ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. ఇన్ని సంవత్సరాల పాటు మనం కలిసి ఆడిన జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. నీతో ఈ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఎంతో ఆశ్వాదించాను. భారత క్రికెట్ లెజెండ్‌గా నువ్వు అభిమానులకు ఎప్పుడూ గుర్తుంటావు. ఇక ముందు నీ జీవితం మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నా” అని విరాట్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా.. 2011లో ఇంటర్నేషనల్ క్రికెట్ అశ్విన్ కెరీర్ ప్రారంభమైంది. తన కెరీర్‌లో అనేక చరిత్రాత్మక ప్రదర్శనలను అందించాడు. 2016లో ప్రపంచ టెస్టు ర్యాంకింగ్‌లో టాప్ స్పిన్నర్‌గా నిలిచాడు. భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. “ఈ ప్రయాణం నా జీవితంలో ఒక ప్రత్యేకమైన భాగం. దేశం కోసం ఆడిన అనుభవం మర్చిపోలేనిది.” అని అశ్విన్ పేర్కొన్నారు. కాగా.. టీమిండియా తరఫున రవిచంద్రన్ అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 4,400 పరుగులు చేయగా, 765 వికెట్లు పడగొట్టాడు.