NTV Telugu Site icon

Virat Kohli: ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు… క్లారిటీ ఇచ్చిన కోహ్లీ!

Virat Kohli

Virat Kohli

దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రపంచంలో ఉన్న క్రికెటర్లు అందరి కంటే కోహ్లీ ఎక్కువ సంపాదిస్తున్నాడనే టాక్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు ఈ రన్నింగ్ మిషన్. బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్స్ లో కనిపిస్తూ ఒక్కో యాడ్ కు భారీగానే వసూలు చేస్తున్నాడు. యాడ్స్ ద్వారానే సంవత్సరానికి వందల కోట్లు సంపాదిస్తున్నాడు కోహ్లీ. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా విరాట్ కు కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు.

Also Read: MS Dhoni: ఆ విషయంలో ఇబ్బంది పడిన ధోనీ, సాయం చేసిన అభిమాని… వీడియో వైరల్

అయన తన పోస్ట్ ల ద్వారా కూడా భారీ ఆదాయాన్ని ఆర్జీస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు ఏకంగా రూ.11.45 కోట్లు వసూలు చేస్తున్నాడంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తపై స్వయంగా కోహ్లీనే స్పందించాడు. ట్విటర్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. జీవితంలో తనకు లభించిన ప్రతిదానికి రుణపడి ఉన్నానని కోహ్లీ చెప్పాడు. సోషల్ మీడియాలో తన సంపాదన గురించి వస్తున్న వార్తలు నిజం కాదని కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు.

Show comments