NTV Telugu Site icon

Virat Kohli Fan Girl: విరాట్ కోహ్లీకి గిఫ్ట్ ఇచ్చిన శ్రీలంక యువతి.. వీడియో వైరల్!

Virat Kohli Side

Virat Kohli Side

Sri Lanka Lady Fan Gives Handmade Portrait to Virat Kohli: భారత స్టార్ బ్యాట‌ర్, రికార్డుల రారాజు ‘విరాట్ కోహ్లీ’కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కింగ్ కోహ్లీకి ఫాన్స్ ఉన్నారు. దాయాది పాకిస్తాన్‌లోనూ చాలా మందే అభిమానులు ఉన్నారు. ఇటీవల కోహ్లీ ఆటను చూసేందుకు పాక్‌కు చెందిన ఓ లేడీ అభిమాని ఏకంగా శ్రీలంకకు వచ్చింది. తాజాగా ఓ శ్రీలంక యువతి తన అభిమాన క్రికెటర్ కోహ్లీని కలిసి తెగ సంబరపడిపోయింది.

ఆసియా కప్ 2023 కోసం శ్రీలంకలో ఉన్న విరాట్ కోహ్లీపై లంకకు చెందిన ఒక వీరాభిమాని తన అభిమానాన్ని చాటుకుంది. లంకకు చెందిన ఓ లేడీ ఫాన్ తన చేతితో తయారు చేసిన పెయింటింగ్ (పోర్ట్రెయిట్‌)ను కోహ్లీకి అందజేసింది. ఇటీవలి కాలంలో కోహ్లీ ఎమోషనల్ మూమెంట్‌ను ఆమె స్వయంగా గీసింది. ఈ విషయం కోహ్లీకి చెబుతూ ఆనందపడిపోయింది.గిఫ్ట్ తీసుకున్న కోహ్లీ.. ఆమెకు థాంక్స్ చెప్పి ఫొటో దిగాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ చేసిన అనంతరం కోహ్లీ చేసుకున్న సంబరాలకు సంబందించిన మూమెంట్‌ను శ్రీలంక యువతి గీసింది.

Also Read: Asia Cup 2023: పాకిస్థాన్‌, శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరే జట్టేదో తెలుసా?

ఎలాంటి ఆటగాడికైనా వయసు పెరిగికొద్దీ.. ఆట, దూకుడు తగ్గడం, ఫామ్ దెబ్బ తినడం మామూలే. విరాట్ కోహ్లీ కూడా ఒక దశలో ఫామ్‌తో తంటాలు పడ్డాడు. దీనికి తోడు కరోనా వైరస్ మహమ్మారి కూడా తన ఫామ్ మీద మరింత ప్రతికూల ప్రభావం చూపింది. మూడేళ్ల తర్వాత విరాట్ మళ్లీ 2022లో ఫామ్ అందుకున్నాడు. ఆసియా కప్‌ 2022లో అఫ్గానిస్థాన్‌పై టీ20ల్లో సెంచరీ సాధించాడు. టీ20 ప్రపంచకప్‌ 2022లో పాకిస్థాన్‌పై ఆడిన సంచలన ఇన్నింగ్స్‌ను క్రికెట్ ప్రేమికులెవ్వరూ మరిచిపోలేరు. ఆ తర్వాత వన్డేలు, టెస్టుల్లో కూడా ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ సెంచరీలు సాధించాడు. ఈ ఏడాదిలో విరాట్ ఊపు మామూలుగా లేదు. ఈ ఏడాది విరాట్ అంతర్జాతీయ పరుగులు వెయ్యి దాటగా.. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఆసియా కప్‌2023లో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో కోహ్లీ ఇన్నింగ్స్ అభిమానులను ఉర్రూతలూగించింది.