Site icon NTV Telugu

Virat Kohli: ఎనిమిదేళ్ల తర్వాత బరిలోకి.. గుడ్డు పెట్టిన విరాట్ కోహ్లీ!

Virat Kohli Duck

Virat Kohli Duck

Virat Kohli Duck in IND vs NZ 1st Test: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న విరాట్.. పరుగుల ఖాతానే తెరవలేదు. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్ క్యాచ్‌ పట్టడంతో కింగ్ పెవిలియన్‌కు చేరాడు. కోహ్లీ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘కోహ్లీ పెద్ద గుడ్డు పెట్టాడు’ అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఎక్కువగా సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తుంటాడు. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీతో ఈ టెస్టులో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. డకౌట్ అవ్వడంతో మరోసారి వన్‌డౌన్ అతడికి కలిసిరాలేదు. 2016లో వెస్టిండీస్‌పై వన్‌డౌన్‌లో విరాట్ బ్యాటింగ్‌కు వచ్చి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 3, 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటివరకు టెస్టుల్లో కింగ్ కేవలం నాలుగు టెస్టుల్లో మాత్రమే వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 97 పరుగులే చేశాడు. కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. విరాట్ అత్యధిక స్కోర్ 41.

Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. వరుసగా రెండోరోజు భారీగా పెరిగిన బంగారం ధర!

తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అవ్వడంతో విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. అంతర్జాతీయంగా అతడికి ఇది 38వ డక్‌. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో కివీస్ పేసర్ టిమ్‌ సౌథీ (38)తో విరాట్ సమంగా నిలిచాడు. వీరిద్దరి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (33) ఉన్నాడు. అన్ని ఫార్మాట్లు కలిపి ఓవరాల్‌గా స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ (59) అగ్ర స్థానంలో ఉన్నాడు.

Exit mobile version