Site icon NTV Telugu

Virat Kohli – DK: దినేష్ కార్తీక్ ముందు తలవంచిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..

Virat Kohli

Virat Kohli

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి అర్ధ భాగంలో కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలవగా, ఆ తర్వాత రెండవ అర్థభాగంలో మాత్రం వరుస విజయాలతో మిగతా టీమ్స్ కు పోటీగా నిలబడుతోంది. మ్యాచ్ మ్యాచ్ కు విజయం సాధించుకుంటూ పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో నుంచి తాజాగా ఏడవ స్థానానికి ఎగబాకింది. ఇకపోతే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ సెర్మని అయిపోయిన తర్వాత ఓ సరదా సన్నివేశాన్ని సృష్టించాడు. ఈ విషయం సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: After 9 Pub: బంజారాహిల్స్ ‘ఆఫ్టర్ నైన్ పబ్’ లో గలీజ్ దందా.. యువకులను ఆకర్షించేందుకు ఏకంగా..

మ్యాచ్ అనంతరం ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మీడియా ముందుకు దినేష్ కార్తీక్ వెళ్లాడు. అయితే అదే సమయంలో మరోసారి విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ ధరించాలన్న విషయం చెప్పడంతో.. విరాట్ కోహ్లీ అక్కడికి చేరుకుంటాడు. అయితే ఆ సమయంలో దినేష్ కార్తీక్ ఆరెంజ్ క్యాప్ ను విరాట్ కోహ్లీకి అందించమని కోరారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ చేసిన పని అందరికీ షాక్ ఇచ్చింది.

Also Read: Black Cobra: భక్తి ఇలా కూడా ఉంటుందా.. బతికున్న నల్లత్రాచుకు పూజలు.. వీడియో వైరల్..

శనివారం నాడు జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 42 పరుగులు చేశాడు. దాంతో మరోసారి ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మరోసారి విరాట్ కోహ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాడు. దాంతో ఆరెంజ్ క్యాప్ ఇవ్వడానికి దినేష్ కార్తీక్ విరాట్ కోహ్లీవైపు తిరిగాడు. దాంతో దినేష్ కార్తీక్ ముందు విరాట్ కోహ్లీ తలవంచి నమస్కరిస్తూ ఆరెంజ్ క్యాప్ ను తలపై పెట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ అలా చేయడంతో దినేష్ కార్తీక్ నవ్వేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version