Site icon NTV Telugu

Virat Kohli: ఐపీఎల్‌లో జట్టు మారాలని అనుకున్నా.. కోహ్లీ హాట్ కామెంట్స్!

Kohli Copy

Kohli Copy

Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు నిలకడగా ఆడిన ఆటగాడు అంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే అని చెప్పవచ్చు. 2008లో తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టుకు ఆడుతున్న కోహ్లీ తాజాగా చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆర్సీబీ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయినా ఓ వీడియోలో పోడ్కాస్ట్‌ షో లో భాగంగా కోహ్లీ మాట్లాడుతూ.. ఒక దశలో తాను జట్టు మారాలని ఆలోచించానని తెలిపాడు. కోహ్లీ తన కెరీర్‌లో 2016-2019 మధ్యకాలాన్ని అత్యంత ఒత్తిడితో కూడిన సమయమని గుర్తు చేశాడు. ఆ సమయంలో భారత్ జట్టుకు, RCBకి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించడంతో పాటు ప్రతీ మ్యాచ్‌ లోనూ తన ప్రదర్శనపై అపారమైన అంచనాలు ఉండటం వల్ల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని తెలిపాడు.

Read Also: Yamaha Aerox 155: స్టైలిష్ కలర్ ఆప్షన్లు, OBD-2B ఎమిషన్ నిబంధనలతో యమహా ఎయిరాక్స్ 155 భారత్‌లో లాంచ్..!

ఆ సమయంలో తనకు ఏం చేయాలో తెలియక గందరగోళంగా అనిపించేదనని తెలిపారు. ఆటపై నిత్యం ఫోకస్ ఉండేది.. ఎప్పుడు చూసినా అందరి దృష్టి నాపైనే ఉండేదని కోహ్లీ అన్నారు. అయితే వీటన్నిటిని కొద్దీ రోజులు పక్కన పెట్టి నేను కొంత సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఆ సమయంలో కొన్ని సంవత్సరాలు తనకు కొన్ని జట్ల నుంచి తమ జట్టుకు మారాలని సూచనలు వచ్చాయని, ఆలోచన కూడా వచ్చిందని చెప్పారు. కానీ, ఆ చివరికి తాను ఆర్సీబీకీ ఎక్కువగా విలువ ఇచ్చానని, అదే తన నిర్ణయాన్ని నిలబెట్టిందని చెప్పారు.

Read Also: Minister Sridhar Babu: అందుకే సీఎం అలా మాట్లాడారు.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు క్లారిటీ!

ఇకపోతే, 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత RCB కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగాడు. ఆ తర్వాత కొద్దికాలానికే టీ20 కెప్టెన్సీని కూడా వదిలాడు. అదే సమయంలోనే బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలగించగా, భారత్ దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓడిపోయిన తర్వాత టెస్ట్ కెప్టెన్సీకి కూడా రాజీనామా చేశాడు.

Exit mobile version