NTV Telugu Site icon

Virat Kohli: ఐపీఎల్‌లో కోహ్లీ అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించాడు..

Virat Kohli

Virat Kohli

ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ-20ల్లో 12 వేల పరుగులు చేసిన తొలి ఇండియన్‌ క్రికెటర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌ కోహ్లీ.. టీ-20 ఫార్మాట్‌లో ఇంత వరకూ 376 మ్యాచ్‌లు ఆడాడు కోహ్లీ.. ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కాగా, IPL 2024 సీజన్లో చెన్నై బోణీ కొట్టింది. బెంగళూరుపై ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK… కేవలం 4 వికెట్లు కోల్పోయి…. 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. IPLలో తొలి సారిగా ఆడుతున్న CSK ఆటగాడు రచిన్‌ రవీంద్ర చెలరేగాడు. 15 బంతుల్లో 3 సిక్సులు, 3 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. అలాగే, శివమ్‌ దూబే 27 బంతుల్లో 34 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. CSK కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రుతురాజ్‌ గైక్వాడ్‌ 15 పరుగులు మాత్రమే చేశాడు. RCB బౌలర్లలో గ్రీన్‌ రెండు వికెట్లు తీయగా, యశ్‌ దయాల్‌, కర్ణ్‌ శర్మ తలో వికెట్‌ చేశారు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన RCB 78 పరుగులకే కీలక వికెట్లను కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును అనుజ్‌, కార్తీక్‌ల జోడీ ఆదుకుంది. ఆరో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనుజ్‌ రావత్‌ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 పరుగులతో రాణించాడు. దినేశ్‌ కార్తీక్‌ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విరాట్‌ కోహ్లీ 21 పరుగులతో రాణించాడు. 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు నష్టానికి 173 పరుగులు చేసింది బెంగళూరు. CSK బౌలర్లలో ముస్తఫిజర్‌ రెహ్మాన్‌ 4 వికెట్లు తీయగా, దీపక్‌ చాహర్‌ ఒక వికెట్‌ తీశాడు.

అయితే, ఐపీఎల్ లో క్రిస్ గేల్, షోయబ్ మాలిక్ మరియు కీరన్ పొలార్డ్ వంటి దిగ్గజాలను అధిగమించి టీ20ల్లో 12,000 పరుగులు చేసిన తొలి భారతీయుడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ పోరులో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఇక, రోహిత్ శర్మ 426 మ్యాచ్‌ల్లో 11156 పరుగులతో.. 329 మ్యాచ్‌ల్లో 9645 పరుగులు చేసిన శిఖర్ ధావన్ తర్వాతి స్థానంలో ఉన్నారు.