Site icon NTV Telugu

Virat Kohli: కోహ్లీని కలిసిన జహీర్.. ఆ ఫోన్లో ఏముంది..?

Kohli Zaheer

Kohli Zaheer

Virat Kohli: సీజన్ చివరి లీగ్ మ్యాచ్ కి ఆర్సీబీ సిద్ధమైంది. మంగళవారం నాడు ఆర్సీబీ, లక్నో మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆర్సీబీ టాప్2లోకి వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు మైదానంలో గంటలతరబడి ప్రాక్టీస్ చేశారు. ఇది ఇలా ఉండగా.. విరాట్ కోహ్లీ మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. లక్నో సూపర్ జాయింట్స్ మెంటర్ జహీర్ ఖాన్ కోహ్లీని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే..

Read Also: iQOO Neo 10: 50MP కెమెరా, 6.78 అంగుళాల డిస్‌ప్లే, ఉచితంగా TWS 1e ఇయర్‌బడ్స్ తో iQOO నియో 10 లాంచ్..!

జహీర్ ఖాన్, కోహ్లీ మాట్లాడుతున్న సమయంలో జహీర్ ఖాన్ తన మొబైల్ తీసి కోహ్లీకి ఎదో చూపించాడు. దానికి కోహ్లీ అంతే ఆసక్తిగా స్పందించాడు. ఇంతకీ జహీర్ కోహ్లీకి ఏమి చూపించి ఉండొచ్చని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. అదీ కాకుండా.. కీలక మ్యాచ్ ముందు ఒక మెంటర్ ప్రత్యర్థి జట్టు ఆటగాడిని కలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిజానికి జహీర్ దంపతులు ఇటీవల బేబీ బాయ్ కి జన్మనిచ్చారు. తన కొడుకు ఫోటోలను కోహ్లీకి చూపించేందుకే జహీర్ మైదానానికి వెళ్లినట్లు తెలుస్తుంది.

Read Also: CRPF Jawan Arrest: దేశ భద్రత విషయంలో CRPF జవాన్‌ను అరెస్ట్ చేసిన NIA..!

ఈ సందర్భంగా జాహీర్ ఖాన్ కొడుకు ఫతేసిన్హ్ ఫోటోలను చూస్తూ కోహ్లీ ఎంజాయ్ చేశాడు. బాబు కళ్ళు జహీర్ లానే ఉన్నాయని అన్నాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా ఈ వీడియోపై ఆసక్తిగా స్పందిస్తున్నారు. కాగా టాప్ 2 స్థానం దక్కాలంటే ఆర్సీబీ లక్నోపై తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ ఖాతాలో 19 పాయింట్లు ఉంటాయి. ఇక నేడు ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్-2 కు చేరనుంది.

Exit mobile version