Site icon NTV Telugu

Kohli-Rohit: వన్డేలకూ కోహ్లీ, రోహిత్ గుడ్‌బై చెప్పేశారా?.. అయోమయానికి గురైన అభిమానులు!

Kohli Rohit

Kohli Rohit

టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్‌ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలు.. వన్డేలకూ గుడ్‌బై చెప్పేశారా? అని అభిమానులు అయోమయానికి గురయ్యారు. హఠాత్తుగా ఈ నిర్ణయం ఏంటి? అని బుధవారం అభిమానులు కాసేపు జోరుగా చర్చలు జరిపారు. ఇందుకు కారణం ఐసీసీ. ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ పేర్లు కనిపించకపోవడమే ఇందుకు కారణం. సాంకేతిక కారణాల వల్లే ఇద్దరి పేర్లు ర్యాంకింగ్స్‌ జాబితాలో కనిపించలేదని ఐసీసీ తర్వాత ప్రకటించింది. కాసేపటికి కోహ్లీ, రోహిత్ పేర్లు కనిపించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Jio Recharge: యూజర్లకు ‘జియో’ మరో షాక్.. రూ.799 ప్లాన్‌కూ చరమగీతం!

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇటీవల ఇంగ్లండ్ డ్‌తో టెస్టు సిరీస్‌ ముణ్దు ఇద్దరు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. 2024 టీ20 ప్రపంచకప్‌ అనంతరం పొట్టి ఫార్మాట్‌ నుంచి తప్పుకొన్నారు. బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లో ఆడాల్సి ఉన్నా.. అది వాయిదా పడింది. ఇక నవంబరులో ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ, రోహిత్‌ బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం ఇద్దరు మాజీ కెప్టెన్స్ కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. మరోవైపు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. కేవలం ఐపీఎల్, వన్డేలు మాత్రమే ఆడనున్నారు. 2027 ప్రపంచకప్‌ వరకు వన్డేల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

Exit mobile version