NTV Telugu Site icon

Viral Video: స్కూల్ ఆవరణలో రెండు స్కూల్ బస్సుల్లో చెలరేగిన మంటలు.. చివరకు..?!

14

14

ఆదివారం మధ్యాహ్న సమయంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ద్వారక సెక్టార్ 9 లోని ఆర్‌డి రాజ్‌పాల్ పబ్లిక్ స్కూల్‌ లో స్కూల్ ఆవరణలో వారు పార్క్ చేసిన రెండు స్కూల్ బస్సుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో రెండు స్కూల్ బస్సులు అక్కడే పూర్తిగా దగ్దమయ్యాయి. స్కూల్ ఆవరణలోనే ఇలా జరగడంతో స్కూల్ యాజమాన్యం ఈ విషయంపై అసలు ఏం జరిగిందో అన్న విషయంపై ఆరా తీస్తున్నారు.

Also read: Pavan kalyan: ఎమ్మెల్యే నిజంగా చిత్తశుద్ధిగా పనిచేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం.. పవన్ కళ్యాణ్..!

ఇక ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూల్ దగ్గర ఉన్న స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

Also read: Israel-Iran Conflict: ఇజ్రాయిల్‌కి అమెరికా షాక్.. ఇరాన్‌పై దాడిలో పాల్గొనమన్న బైడెన్..

సంఘటన జరుగుతున్న సమయంలో ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వగా.. ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏకంగా 4 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. ఇకపోతే ఈ సంఘటన ఎలా జరిగింది అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

Show comments