NTV Telugu Site icon

Viral Video: 10 ఉద్యోగాలు.. 1,800 మంది అభ్యర్థులు హాజరు! కుప్పకూలిన రెయిలింగ్‌

Railing Collapses

Railing Collapses

Railing Collapses in Gujarat after 1800 Students Turn Up For 10 Jobs: ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న ఉద్యోగానికైనా భారీగా కాంపిటీషన్ ఉంది. ఇక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం గురించైతే చెప్పక్కర్లేదు. ఉద్యోగ ప్రకటన వస్తే చాలు.. వేలల్లో అభ్యర్థులు హాజరవుతుంటారు. ఒక్కోసారి ఇంటర్వ్యూ సంగతి దేవుడెరుగు కానీ.. ఎంట్రీకే చాలా కష్టమైపోతుంటుంది. చాలా సార్లు అభ్యర్థుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. 10 ఉద్యోగాలకోసం 1,800 మంది అభ్యర్థులు హాజరవ్వడంతో రెయిలింగ్‌ కుప్పకూలింది. పలువురు అభ్యర్థులు కిందపడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also Read: Mrunal Thakur Pic: ‘దివ్య’గా మృణాల్ ఠాకూర్.. కొత్త ఫోటో వైరల్!

ఝగాడియాలోని గుజరాత్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ కాంప్లెక్స్‌లో ఓ ప్రైవేటు సంస్థ ఉంది. ఆ సంస్థ 10 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇంటర్వ్యూకి ఏకంగా 1,800 మంది హాజరయ్యారు. కాంప్లెక్స్‌ లోపలికి వెళ్లేందుకు అందరూ పోటీపడ్డారు. ఈక్రమంలో తోపులాట చోటుచేసుకుంది. ఒత్తిడిని తట్టుకోలేని కొందరు మధ్య నుంచే బయటికి వచ్చారు. తోపులాట కారణంగా రెయిలింగ్‌ కుప్పకూలింది. దాంతో కొందరు రెయిలింగ్‌ కింద చిక్కుకున్నారు. అయితే ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి కామెంట్ల వర్షం కురుస్తోంది.