NTV Telugu Site icon

Viral Video: కొడుకు కళ్లముందే తండ్రిని చావబాదిన పోలీసులు.. పోలీసులు కాళ్లు పట్టుకున్నా వదలకుండా..

11

11

రాజస్థాన్ రాష్ట్రంలో కొందరు పోలీసులు కన్న కొడుకు కళ్లముందే తండ్రిని దారుణంగా కొట్టారు. ఇందుకు సంబందించిన ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్‌ లోని జైసింగ్‌పురా ప్రాంతంలోని భంకత్రోటాలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇక అందిన వివరాల ప్రకారం.. పోలీసులు కొట్టిన వ్యక్తిని 35 ఏళ్ల చిరంజిలాల్‌ గా గుర్తించారు. ఆయన వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

Also read: Vishal : ప్రభాస్ పెళ్లి తరువాతే నా పెళ్లి.. విశాల్ కామెంట్స్ వైరల్..

అందిన సమాచారం మేరకు ఆయన గత ఏడాది కాలంగా తన భార్యతో వివాదంలో ఉన్నాడు. ఇకపోతే ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తూ.. ఈ సంఘటన జరిగిన రోజు పోలీసులు అతని భార్యతో కలిసి భంకత్రోటకు చేరుకుని.. వారు ఉంటున్న ఇంటి తాళాలు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి తాళం ఎందుకు పగులగొట్టారని చిరంజిలాల్ పోలీసులను ప్రశ్నించగా.., దాంతో అతనిని పోలీసులు చితకబాదారు.

Also read: West Bengal : పశ్చిమ బెంగాల్‌లో రామ నవమి సందర్భంగా హింస.. ఎన్ఐఏ దర్యాప్తుకు డిమాండ్

ఆ వ్యక్తిని పోలీసులు కిరాతకంగా కొట్టిన సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియోలో కొడుకు మోకాళ్లపై చేతులు జోడించి, తన తండ్రిని కొట్టవద్దని పోలీసులను ఎంత వేడుకున్న పోలీసులు మాతరం కనికరం కూడా చూపడం లేదు. చిరంజిలాల్ కొడుకు పోలీసుల పాదాలను తాకడం కూడా ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో.., పోలీస్ అధికారులు సంఘటనను సంబంధించి విచారణకు ఆదేశించారు. ఇక పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న చిరంజిలాల్ కు చేతికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.