NTV Telugu Site icon

Viral Video: కదులుతున్న తులసి చెట్టు.. చూసేందుకు ఎగబడుతున్న జనం..

Moving Thulasi

Moving Thulasi

సోషల్ మీడియాలో ప్రపంచంలో జరిగే వింతలను మనం చూడగలుగుతున్నాం.. కొన్ని వార్తలు జనాలకు కోపాన్ని తెప్పిస్తే మరికొన్ని వీడియోలు మాత్రం జనాలను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.. కొన్ని వీడియోలు వింతగా అనిపించడంతో జనాలు ఎక్కువగా చూడటానికి ఇష్ట పడుతున్నారు.. తాజాగా ఓ వింత ఘటన వెలుగు చూసింది.. ఓ తులసి చెట్టు కదులుతుంది.. అది కూడా ఓ రిమోట్ ఆపరేటింగ్ ఉన్నట్లు బాపు బొమ్మలా ఊగిపోతుంది.. అది దేవుడి మహిమ అంటూ జనాలు ఆ వింతను చూడటానికి ఎగబడుతున్నారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

సాదారణంగా హిందూ మతంలో తులసికి గౌరవప్రదమైన స్థానం ఉంది. ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క తప్పక ఉంటుంది. ప్రతిరోజూ తులసిని పూజించిన తర్వాతే మిగతా పనులు ప్రారంభిస్తారు చాలా మంది. ఇంత పవిత్రమైన తులసి మొక్క కుడివైపు తిరగడం ఎప్పుడైనా చూసారా… ? వైరల్ అవుతున్న వీడియో లో అలాంటి దృశ్యం కనిపించింది. తులసి మొక్క దానికదే అటూ ఇటూ తిరుగుతున్న దృశ్యం చూపరులను ఆశ్చర్యపోయేలా చేస్తుంది.. అసలు అలా ఎలా సాధ్యం అనే ఆలోచనలో జనాలు ఉంటున్నారు..

ఈ వైరల్‌ వీడియో లో తులసి మొక్క ప్రదక్షణలు చేసిన విధంగా తిరుగుతున్నట్టుగా ఉంది. ఒక ఎత్తైన చెట్టు అడుగున నాటిన తులసి మొక్క అటు ఇటు తిరుగుతున్నట్లుంది. అది చూసిన మహిళలు ఆశ్చర్య పోవటం, ఉత్సుకత ను వ్యక్తం చేయడం వీడియోలో వినిపించింది. తులసి మొక్క దానంతటదే కదులుతోంది.. డ్యాన్స్‌ చేస్తోంది.. అంటూ చర్చించుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌లలో చక్కర్లు కొడుతోంది.. ఈ వీడియో ఎప్పుడూ ఎక్కడ రికార్డ్ అయ్యిందో తెలియదు కానీ.. వీడియో పోస్ట్ అయిన కొద్ది గంటల్లోనే బాగా వైరల్ అవుతుంది.. మీ కళ్ళతో ఒకసారి మీరే చూడండి..