స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పి విద్యార్థులను సన్మార్గాంలో నడిపించాల్సిన టీచర్లు క్లాస్ రూమ్ లోనే విద్యార్థుల ముందు వింత పనులు చేస్తున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా టీచర్లు వీర కొట్టుడు కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ ఘటన కేరళలో ని ఓ పాఠశాల లో వెలుగు చూసింది.. ఆ ఘర్షణలో ఏడుగురు టీచర్లు గాయపడ్డారు..
వివరాల్లోకి వెళితే.. ఎరవన్నూరులోని ఏయూపీ స్కూల్‌లో ఓ మహిళా టీచర్ పనిచేస్తోంది. ఆమె భర్త మరో స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాడు. అయితే మహిళా టీచర్ స్కూల్లో ఓ విద్యార్థిని కొట్టింది. దానికి సంబంధించి టీచర్ల మీటింగ్‌లో ఆమెను మందలించారు. విషయం తెలిసిన ఆమె భర్త.. భార్య పనిచేస్తున్న స్కూల్‌కి వచ్చి మిగతా టీచర్లతో గొడవపడ్డాడు.. ఆ క్రమంలో మాటా మాట పెరిగింది.. చేతులకు పని చెప్పారు.. వీరకుమ్ముడు కుమ్మాడు ఆ మహిళా భర్త..
ఉపాధ్యాయుడి మీద చేయి కూడా చేసుకున్నాడు. అడ్డుకోబోయిన మరికొంతమంది టీచర్ల మీద కూడా దాడి చేశాడు. ఏయూపీ స్కూల్ టీచర్ల ఫిర్యాదుతో దాడి చేసిన టీచర్‌ను బుధవారం అరెస్ట్ చేశారు.. గొడవ జరుగుతున్న సమయంలో కొందరు వీడియోను తీశారు.. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియోను చూసిన వారంతా తెగ కామెంట్ల తో రచ్చ చేస్తున్నారు..