Site icon NTV Telugu

Viral Video: ఏంట్రా ఇలా తయారయ్యారు.. పెళ్ళిచేయడానికి వచ్చిన పంతులను ఏకంగా..

12

12

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం నడుస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వుకోడానికి, మరికొన్ని భయపెట్టేలా ఉంటాయి. మరికొన్ని అయితే జంతువుల యొక్క సంబంధించిన వైరల్ వీడియోలు కూడా వైరల్ గా మారుతుంటాయి. అప్పుడప్పుడు పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఓ పెళ్లి మండపంలో పంతులు గారికి జరిగిన అవమానం సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో గురించి చూస్తే..

Also Read: Seethakka: నా పేరుతో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.. ఆధారాలు బయట పెట్టండి..

ఈ వీడియోలో మొదటగా పంతులు పెళ్లి మండపంపై వధూవరులను ఆశీర్వదించడానికి అక్షింతలు వేరే వారి చేతుల్లో పెడుతుండగా ఎవరో వెనకాల నుంచి వచ్చి పూజారి తల పై ఓ ప్లాస్టిక్ బ్యాగ్ ను అడ్డంగా ఉంచారు. దాంతో అక్కడే పెళ్లి పీటలపై ఉన్న పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కూడా ఒకింత షాక్ అయ్యారు. ఆ తర్వాత పెళ్లి తంతు నిర్వహిస్తున్న పంతులపై కుంకుమ పసుపులు వేయడం, అలాగే ఓ మఫ్లర్ ను వేయడం కూడా వీడియోలో చూడవచ్చు. దాంతో కోపద్రకుడైన పంతులు పెళ్లి పెద్దలపై కోప్పడ్డాడు. పెళ్లి చేయడానికి వచ్చిన తనని ఇలా అవమానిస్తారా అంటూ వారిని కోపంతో మందలించాడు.

Also Read: Punjab : చాక్లెట్లు తిన్న చిన్నారులకు రక్తపు వాంతులు.. ఆగ్రహించిన కుటుంబసభ్యులు

అయితే అలా జరిగిన తర్వాత కూడా పంతులు వెనుక భాగంలో ఎర్రటి రంగు వలె రక్తం కారుతున్న విధంగా కనపడింది. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది ఏంటన్న విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. పంతులు పై జరిగిన దానికి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా యూజర్స్ మీరు అసలు మనుషులేనా.. పెళ్లి చేయడానికి వచ్చిన పూజారిని ఇలా చేయడం ఏం భావ్యమంటూ తిడుతుండగా.. మరికొందరైతే పూజారిపై జరిగిన ఈ అవమానాన్ని చూసి చాలా బాధేస్తుంది., అతడు శుభకార్యం చేస్తున్న సమయంలో ఇలా చేయడం సరికాదు అంటూ తీవ్రంగా ఖండిస్తున్నారు.

Exit mobile version