Site icon NTV Telugu

Viral Video : వామ్మో..పానీపూరిలో ఇన్ని రంగులు ఉన్నాయా?.. వీడియో చూస్తే అవాక్కవుతారు ..

Rangula Panipuri

Rangula Panipuri

పానీపూరికి దేశ, విదేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు.. సాయంత్రం 4 అయితే చాలు వీధి చివరన పానీపూరి బండ్ల దగ్గర జనాలు గుంపులు గుంపులుగా ఉంటారు.. ఆ రుచికి ఎవరైన ఫిదా అవ్వాల్సిందే.. అందుకే వేలు పెట్టిన ఎందులోనూ దొరకని రుచి పానీపూరికి ఉంటుంది.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పానీపూరిని ఇష్టంగా లాగిస్తారు.. అయితే మనం ఇప్పటివరకు మనం ఒక రకమైన పానీపూరిలను చూసి ఉంటాం.. కానీ ఇప్పుడు రెయిన్ బో పానీపూరి ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

గుజరాత్ లోని ఓ వీధి వ్యాపారి వినూత్న ఆలోచన చేశాడు.. రంగు రంగుల రెయిన్ బో పానీపూరి తయారు చేశాడు.  బ్లాక్‌, పింక్‌, యల్లో షేడ్స్‌లో స్ట్రీట్ వెండర్ రెయిన్‌బో పానీపూరీలు అమ్ముతున్నాడు. ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వీటిని ఇండియన్ బ్లాక్‌బెర్రీస్‌, బీట్రూట్‌, హల్దీతో ఈ రంగుల పానీపూరి లను తయారు చేయడం విశేషం.

ఎవరికి నచ్చిన పానీపూరిని వాళ్లు తీసుకుంటారు.. లొట్టలు వేసుకుంటు తింటారు.. ఇకపోతే పానీపూరీల్లో ఎలాంటి కృత్రిమ రంగులు వాడలేదని చెబుతుండటం కనిపిస్తుంది. కేవలం పాలకూర, పుదీనా పానీపూరి వాటర్ కోసం వాడామని చెబుతున్నారు.. ఈ పానీపూరిల వీడియో ఒకటి సోషల్ తెగ చక్కర్లు కొడుతుంది.. ఈ వీడియో చూసిన పానీపూరి లవర్స్ షాక్ అవుతున్నారు.. ఒకసారి ఆ కలర్ ఫుల్ పానీపూరీలు ఎలా ఉన్నాయో చూడండి..

Exit mobile version