NTV Telugu Site icon

Viral video: విమానంలో విండో సీటు కోసం దారుణంగా కొట్టుకున్న ప్రయాణికులు..

Ran Air Flight

Ran Air Flight

గత కొంతకాలంగా విమనాల్లో కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. దీంతో జనాలు విమానాల్లో ప్రయానించాలంటే వణికిపోతున్నారు..ఇప్పటి వరకు సాధారణ బస్సులు లేదా రైళ్ల జనరల్ కోచ్‌లలో ప్రయాణికులు కొట్టుకోవడం,గొడవపడటం చూశాం. అయితే విమానంలో కిటికీ కోసం ప్రయాణికులు గొడవపడడం ఎప్పుడైనా చూశారా? తాజాగా మాల్టా నుంచి లండన్ వెళ్తున్న ర్యాన్ ఎయిర్ విమానంలో ప్రయాణికులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.. కిటికీ సీటు కోసం ఇద్దరు ప్రయాణీకులు దారుణంగా కొట్టుకున్నారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది..

ర్యాన్ ఎయిర్ విమానం మాల్టా నుంచి లండన్ వైపు వెళ్తుంది.. ప్రయాణికులు విమానంలోకి చేరుకుంటున్నారు. విమానంలో నడవ సీటు ఉన్న ప్రయాణీకుడు ముందుగా వచ్చి తన సీటులో కూర్చున్నాడు. అయితే అతడి పక్కన ఉన్న విండో సీటు సీటులో కూర్చునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. అయితే నడవ సీటులో కూర్చున్న వ్యక్తి విండో సీటు ప్రయాణికుడిని కిటికీ వైపుకి వెళ్లడానికి అనుమతించలేదని చెబుతున్నారు. దీని గురించే ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. కొద్దిసేపటికే ఈ సీటింగ్ ఏర్పాటుపై వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ముందుగా కొంత మంది ప్రయాణికులు వారిద్దరినీ శాంతింపజేసేందుకు ముందుకు వచ్చారు. వీళ్ళ గొడవ తగ్గక పోవడంతో సిబ్బంది కూడా వచ్చి సర్ది చెప్పారు..

ఈ గొడవలో ఇద్దరూ ఒకరినొకరు చాలా దూషించుకుంటూ కొట్టుకున్నారు. నోటికి వచ్చిన బూతులతో తిట్టుకున్నారు.. విమానంలో గొడవ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఇక అక్కడ కూడా వదలరా అంటూ ఓ రేంజులో కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే వైరల్ గా మారుతుంది..అయితే ఇటీవల విమాన ఆలస్యంపై ఓ ప్రయాణికుడు ర్యాన్‌ఎయిర్ కంపెనీపై కేసు పెట్టాడు. ఈ కేసులో ప్రయాణికుడు గెలిచాడు. ఇప్పుడు ఇలా జరగడం పై జనాలు ఆ సంస్థ విమానాల పై ఆసక్తి చూపించడం లేదని సమాచారం..

Show comments