NTV Telugu Site icon

Viral video : ఓరి నాయనో..ఫొటోకు కాపలాగా పాము.. ఒళ్లు గగూర్పొడిచే సీన్..

viral videos

viral videos

కొంతమందికి ఇంట్లో తమకు నచ్చిన విధంగా ఫోటోలను తగించాలని అనుకుంటారు.. ఒక్క ఫొటోలే కాదు రకరకాల అందమైన పెయింట్ ఫోటోలను గోడలకు తగిలిస్తారు.. సాదాగా ఉండే గోడలకు ఆ ప్రేమ్ లను పెడితే చాలా అందంగా ఉంటాయి..అందుకే చాలామంది తమకు నచ్చిన ఫొటోఫ్రేమ్లను తమ ఇంటి గోడలకు వేలాడదీస్తుంటారు. ఇక కొంచెం సౌండ్ పార్టీలైతే మాత్రం ఖరీదైన పెయింటింగ్స్‌ను గోడలపై తగిలేయడం మనం చూసే ఉంటాం.. డబ్బులు ఖర్చు చేసి మరి పెడతారు..

ఇలా ఫోటో ఫ్రెమ్ ల వరకు బాగానే ఉంది కానీ ఒక్కోసారి వాటి వెనుక భయంకరమైన దృశ్యాలను చూస్తుంటాము.. సినిమాలల్లో చూపించిన విధంగా ఫోటోలకు కాపలాగా భయంకరమైన పాములు లేదా వింత జీవులు ఉంటే ఇక అంతే సంగతి.. వింటుంటేనే భయంతో గుండెల్లో వణుకు పుతుంది కదూ.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. ఆస్ట్రేలియా లో ఓ ఇంటి యజమానికి ఇలాంటి భయంకర అనుభవమే ఎదురైంది. ఎంతో ముచ్చపడి ఇంట్లో గోడకు వేలాడదీసిన ఒక ఫొటోఫ్రేమ్ వెనక గుండెలు అదిరే దృశ్యం కనిపించింది. ఆ ఫొటోఫ్రేమ్ వెనకాల ఒక పెద్ద కొండచిలువ తిష్ట వేసింది. దర్జాగా లోపల దాక్కుంది..

అమ్మ బాబోయ్.. ఇంకేముంది.. ఆ భారీ పామును చూడగానే మనోడికి గుండెలు ఆగినంత పనైంది. వెంటనే పాములను పట్టేవారికి కబురు అందించాడు. దాంతో వారు వచ్చి కొండచిలువను పట్టుకెళ్లారు. ఆ సమయంలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది… ఆ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. వాటికి కూడా అవి నచ్చాయేమో అని, ఆ ఫ్రెమ్ కు చంద్రముఖి లాంటి చరిత్ర ఉందేమో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా ఇలా ఒక్కసారి చూస్తే గుండె ఆగిపోదు..ఆ వీడియో పై మీరు లుక్ వేసుకోండి..

Show comments