NTV Telugu Site icon

Viral Video : డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలి చనిపోయిన యువతి

New Project (3)

New Project (3)

Viral Video : ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా చాలామంది దీని బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మారుతున్న ఆహార అలవాట్లు.. వ్యాయామం సరిగా లేకపోవడమే గుండెజబ్బులకు కారణంగా తెలుస్తోంది. మరోసారి చిన్న వయసులోనే గుండెపోటుతో ఓ యువతి మరణించింది. డ్యాన్స్ చేస్తూ ఆ యువతి కుప్పకూలి క్షణాల్లోనే లోకాన్ని వదిలింది.

Read Also:Nandigama: ప్రచారంలో దూసుకుపోతున్న జగన్ మోహన్ రావు..

ఈ మధ్యకాలంలో చాలామంది వారి పిల్లల పెళ్లిళ్ల కోసం ఎలాంటి వెనకడుగు వేయకుండా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కోసారి అనుకోని సంఘటనలు వల్ల పెళ్లి కార్యక్రమంలో జరగాల్సిన శుభకార్యం కంటే అశుభకార్యాలు కూడా జరుగుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే… పెళ్లి వేడుకలలో అంబరాన్ని అంటిన ఆనందాన్ని అనుభవిస్తున్న ఓ కుటుంబం ఉన్న ఫళంగా విషాదంలో మునిగిపోయింది. తన సోదరి పెళ్లికి ముందు జరిగిన హల్దీ వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న 18 ఏళ్ల యువతి ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌లో చోటుచేసుకుంది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కిందపడిపోయిన బాలికను బంధువులు ఆస్పత్రికి తరలించారు.

Read Also:Cyber Fraud: అత్యాశకు పోయాడు.. లింక్‌ క్లిక్‌ చేసి 11 లక్షల 84 వేలు పొగొట్టుకున్నాడు

అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి పేరు రిష్మా. అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న సమయంలో పడిపోగానే ఛాతీ మీద చేయి వేసి అలాగే పడిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ఇంత చిన్న వయసులో అమ్మాయి డాన్స్ చేస్తున్న సమయంలో ఇలా జరగడం చాలా బాధాకరం అంటూ కామెంట్ చేస్తున్నారు.