NTV Telugu Site icon

Viral Video Of Girl Crying: ఫన్నీ వీడియో.. అట్లుంటది ఈ పిల్లతోని

Funny Video Of Girl Crying

Funny Video Of Girl Crying

Viral Video Of Girl Crying: ఇటీవల సోషల్ మీడియా ద్వారా కొందరు ఓవర్ నైట్‌లో స్టార్లు అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. అయితే సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అలాంటి వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ స్కూలులో టీచర్ రైమ్స్ చెప్తుంటే ఓ చిన్నారి మాత్రం ఫన్నీగా స్పందిస్తోంది. ఈ రైమ్‌లో భాగంగా టీచర్ కొన్ని పనులు చేయాలని చెబుతుంటే ఆ పాప మాత్రం ఏడుస్తూ ఏ పనీ చేయనని చెప్తోంది. పళ్లను బాగా తోమాలి అంటే నేను తోమనని, చక్కగా స్నానం చేయాలి అంటే నేను చేయనని, ఉతికిన బట్టలు కట్టాలి అంటే నేను కట్టను అంటూ చెప్తోంది.

Read Also: BJP MP Faggan Singh Kulaste: జొన్నపొత్తు బేరమాడిన బీజేపీ ఎంపీ.. తర్వాత ఏమైంది?

ఈ వీడియోలో మిగతా పిల్లలు చక్కగా టీచర్ చెప్పినట్లు రైమ్స్ చెప్తుంటే ఒక్క పాప మాత్రం టీచర్ చెప్పినట్లు కాకుండా వ్యతిరేకంగా చెబుతోంది. అంతేకాకుండా పాప ఏడుస్తుండటం కూడా నెటిజన్‌లకు నవ్వు తెప్పిస్తోంది. ఓ స్కూలులో ఈ ఘటన చోటుచేసుకోగా కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్‌లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఈ పాప తమ పాపలాగే ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అట్లుంటది పిల్లలతోని అని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బ్యాక్ బెంచర్స్ అలాగే ఉంటారని కొందరు ఈ వీడియో ద్వారా తమ చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

Show comments