Site icon NTV Telugu

Viral Video: లైక్స్ కోసం మరి ఇంత దిగజారాలా? గొర్రెతో ఆ పనులేంటి గురూ.!

Viral Video

Viral Video

Viral Video: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరికతో చాలా మంది ఏ స్థాయికైనా వెళ్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలకే ముప్పు వచ్చేలా వ్యవహరించడానికీ కూడా వెనకాడటం లేదు. అలాంటి ఘటనే తాజాగా ఒక వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇకపోతే, ఆ వీడియోలో ఒక యువకుడు హెల్మెట్ ధరించి గొర్రె ముందు నిలబడ్డాడు. తర్వాత తన రెండు చేతులను నేలపై పెట్టుకుని, గొర్రెలా వంగి నిలబడి తలతో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. దీనితో నిజంగా తనపై ఇంకో గొర్రె దాడి చేస్తుందనుకున్న జంతువు ఆగ్రహంతో అతడిపై దూకింది. వెంటనే తలతో వరుసగా దాడులు ప్రారంభించింది. అయితే, తలకు హెల్మెట్ ఉండటంతో యువకుడికి గాయాలు కాలేదు. దీంతో అతడూ మళ్లీ మళ్లీ జంతువుతో తలపట్టి ఆట కొనసాగించాడు.

Kaleshwaram Project: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు!

ఈ వీడియోను చుసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం డ్రామా అని, లైక్స్–వ్యూస్ కోసం పిచ్చి పనులు చేస్తున్నారని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. ప్రస్తుత బిజీ జీవితంలో కొంతసేపు నవ్వుకునే అవకాశం లభించింది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు నేటి జనాలకు లైక్స్ పిచ్చి తార స్థాయికి చేరుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.

Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం.. 9 మంది మృతి.. ఢిల్లీలో కూడా ప్రకంపనలు

Exit mobile version