NTV Telugu Site icon

Viral Video : మెట్రోలో రొమాన్స్ చేస్తున్న లవర్స్..అది చూసిన ఆంటీ ఏం చేసిందంటే?

Viral

Viral

ఈ మధ్య లవర్స్ రెచ్చిపోతున్నారు..చుట్టూ ఎవరున్నా కూడా పెద్దగా పట్టించుకోరు.. తమలోకం తమదే.. రొమాన్స్ లో మునిగితేలుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. రద్దీగా ఉన్న మెట్రోలో ఓ ప్రేమ జంట రొమాన్స్ లో మునిగిపోయారు.. అది చూసిన వారంతా వారిని మందలించారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

రద్దీగా ఉన్న రైల్లో ప్రేమ జంట రొమాన్స్ మొదలెట్టింది. దీంతో ఓ ఆంటీకి చిర్రెత్తుకొచ్చి ఏం చేసిందో మీరే చూడండి.. ఢిల్లీ మెట్రో రైల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై మెట్రో తరహాలోనే ఢిల్లీలోని మెట్రో రైలు కూడా ప్రయాణికులతో సందు లేకుండా ఉంటుంది.. ఎంతలా అంటే.. కనీసం కాలు తీసి కాలు పెట్టడానికీ చోటు లేదు. ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట చుట్టూ ఉన్న జనాన్ని అస్సలు పట్టించుకోకుండా తమ ధ్యాసలో తాము మునిగిపోయారు..ఇద్దరూ హత్తుకుని ఉండడంతో పాటూ ముద్దులు పెట్టుకుంటూ తాకరాని చోట తాకుతూ రొమాన్స్ చేసుకుంటున్నారు. ”వీళ్లకి ఇంకెక్కడా చోటు లేనట్లు రైలే దొరికిందా. అని కొందరు మనసులో అనుకుంటూ మిన్నకుండిపోయారు..

వీరిద్దరూ చేస్తున్న చెండాలాన్ని చూసిన ఓ ఆంటీ కోపంతో రగిలిపోయింది.. ఆడపిల్లవు చుట్టు జనాలు ఉన్నారని కొంచెం కూడా బుద్ది లేదా అంటూ ఒంటికాలుపై లేచింది.. చెడా మడా తిట్టేసింది.. మా ఇష్టం మాది.. మధ్యలో మమ్మల్ని నిలదీయడానికి నువ్వెవరు”.. అంటూ ఎదురు ప్రశ్నించాడు. దీంతో కొద్దిసేపు వారి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. చివరకు పక్కన ఉన్న వారు కలుగజేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. కాగా, ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.. బామ్మ బాగా బుద్ది చెప్పింది అంటూ కామెంట్స్ చేశారు.. ఇలాంటి వాళ్ల పేరెంట్స్ కు బుద్ది చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

Show comments