NTV Telugu Site icon

Viral Video: అర్ధరాత్రి బైకుపై రెచ్చిపోయిన లవర్స్.. తుఫాకీలతో రచ్చ..

patna

patna

సోషల్ మీడియాలో క్రేజ్ కోసం జనాలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.. మరికొంతమంది హద్దులు చేరిపేస్తూ జనాలకు వారి పిచ్చితో కోపాన్ని తెప్పిస్తున్నారు. లైకుల కోసం రెచ్చిపోతున్నారు.. మనుషుల్లా ప్రవర్తించడం లేదనే చెప్పాలి.. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించిన వారి పద్ధతిని మార్చుకోవడం లేదు.. కొన్ని రోజుల క్రితం నడిరోడ్డుమీద రన్నింగ్ బైకుపై కూర్చుని ముద్దులు పెట్టుకుని హద్దులు దాటారు లవర్స్‌, తాజాగా నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ ఓ బీహారీ యువతి నడిరోడ్డుపై రెచ్చిపోయింది. సోషల్ మీడియా మోజులో పడి ప్రమాదకరమైన స్టంట్స్ చేసింది . రెండు చేతుల్లో తుపాకులు పట్టుకుని స్పీడ్ గా వెళ్తున్న బైక్‎పై నిలబడి వీరంగం సృష్టించింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇక ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టిలో పడింది. దీంతో యువతి చిక్కుల్లో పడినట్లైంది. బీహార్‌లోని పట్నాలో ఈ సంఘటన జరిగింది.. వివరాల్లోకి వెళితే.. పాట్నాకు చెందిన ఓ యువతి ఓ యువకుడు రాత్రివేళ వేగంగా బైక్‌పైన దూసుకెళ్తున్నారు. మెరైన్‌ డ్రైవ్‌ మాదిరిగా స్టంట్‌ చేయాలనుకున్నారో ఏమో, జేపీ గంగా పాథ్‌వేపై యువకుడు బైక్‌‏ను స్పీడుగా నడుపుతుండగా, వెనక కూర్చున్న యువతి ఒక్కసారిగా లేచి నిలబడి తన రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని గాల్లోకి చూపించింది. ఈ దృష్యాలన్నింటిని ఆ పక్కనే వస్తున్న బైకర్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..

ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ వీడియోపై పోలీసులు సీరియస్ అవుతున్నారు.. ఇక పట్నా ఎస్పీ వైభవ్‌ శర్మ దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. వీడియో ఆధారంగా బైక్‌ రిజిస్ట్రేషన్‌ నంబంర్‌ను గుర్తించామని, నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. అలాగే ఈ వీడియో పై నెటిజన్లు రకాల కామెంట్స్ చేస్తున్నారు.. పోయే కాలంలో దగ్గర పడితే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఇది వైరల్ అవుతుంది..