Site icon NTV Telugu

Viral Video: తాకరాని చోట తాకిన బంతి.. అల్లాడిపోయిన కేఎల్ రాహుల్!

Kl Rahul Injury

Kl Rahul Injury

న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయంతో ఇబ్బంది పడ్డాడు. వెస్టిండీస్ పేసర్ జైడన్ సీల్స్ వేసిన బంతి రాహుల్‌కు తాకరాని చోట గట్టిగా తాకింది. దాంతో అతడు మైదానంలోనే కుప్పకూలి.. నొప్పితో వివవిల్లాడాడు. టీమిండియా ఫిజియో మైదానంలోకి పరుగెత్తుకొచ్చి ప్రథమ చికిత్స చేశాడు. కాసేపటికి రాహుల్ నొప్పి నుంచి ఉపశమనం పొందాడు. ఆపై బ్యాటింగ్ కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Shorna Akter: 18 ఏళ్లకే నయా హిస్టరీ.. భళా షోర్నా అక్తర్‌!

టీమిండియా రెండో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో కేఎల్ రాహుల్‌కు దెబ్బ తాకింది. జైడన్ సీల్స్ మూడో బంతిని 140కి పైగా కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించగా రాహుల్ డిఫెండ్ చేశాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి.. నేరుగా రాహుల్ పురుషాంగం భాగంలో తాకింది. బంతి వేగంగా దూసుకురావడంతో రాహుల్ నొప్పితో అల్లాడిపోయాడు. బ్యాట్ అక్కడే పడేసి.. కాసేపు పరుగెత్తాడు. ఆపై మైదానంలోనే పడుకున్నాడు. ఇది గమనించిన టీమిండియా ఫిజియో.. మైదానంలోకి వచ్చి చికిత్స చేశాడు. దాంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. రాహుల్ కుదుటపడ్డాక మ్యాచ్ కొనసాగింది. రాహుల్ గాయంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ‘పాపం రాహుల్.. అల్లాడిపోయాడు’, ‘జాగ్రత్త రాహుల్’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version