NTV Telugu Site icon

Viral Video : పెళ్లి కొడుకు మెడలో నోట్ల దండ.. వామ్మో ఎంత పెద్దగా ఉందో..?

Groom

Groom

ఈ మధ్య పెళ్లికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అందులో కొన్ని వీడియోలు చాలా విచిత్రంగా ఉంటాయి.. వాటిని చూసిన జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా ఓ పెళ్లి వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..

ఆ వీడియోలో ఓ పెళ్లి కొడుకు కరెన్సీ నోట్ల దండతో కనిపించాడు..రూ.500 నోట్లతో తయారు చేసిన ఈ దండలో ఎంత విలువైన కరెన్సీ నోట్లు ఉన్నాయో తెలుసా?.ఇటీవల ఓ పెళ్లికొడుకు తన పెళ్లిలో కరెన్సీ నోట్ల దండతో కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రూ.20 లక్షల విలువైన రూ.500 నోట్లతో ఈ దండను తయారు చేసారట. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పెళ్లికొడుకు కరెన్సీ నోట్ల దండను చూసి నెటిజన్లు నోర్లు వెల్లబెడుతున్నారు..

ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లలో కొందరు అతని సంపదను చూసి ఔరా అని ముగ్ధులైతే.. మరికొందరు ఇంత విపరీతమైన ప్రదర్శన అవసరమా? అని కూడా తిట్టుకున్నారు. ఇంకా కొందరైతే ఆ నోట్లు నిజమైనవి కాకపోవచ్చు కూడా అని అనుమానం వ్యక్తం చేసారు.. మరికొంతమంది అంతగా చెయ్యడం అవసరమా ఇదేం పైత్యం రా బాబు అంటూ తలలు పట్టుకున్నారు..

ఇంటి పై గోడ మీద నిలబడ్డ వరుడి మెడలో వేసిన కరెన్సీ నోట్ల దండ కిందవరకూ వేలాడుతూ కనిపించింది. వివాహ వేడుకల్లో ఇలా ఇప్పటివరకు ఎవరూ ఆకట్టుకుని ఉండకపోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన వీడియో ప్రకారం హర్యానాలోని ఖురేషిపూర్ గ్రామానికి చెందినదిగా భావిస్తున్నారు.. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..