NTV Telugu Site icon

Viral Video: రెండుపాములు డ్యాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందో చూశారా.?

viral video

viral video

మనుషులు మాత్రమే డ్యాన్స్ చేస్తారు అనుకుంటే పొరపాటే.. జంతువులు కూడా ప్రకృతి అందాలను అశ్వాదిస్తూ నృత్యం చేస్తాయి.. ఇక పాములు కలిసి డ్యాన్స్ చెయ్యడం అంటే ఎప్పుడు చూసి ఉండరు.. తాజాగా రెండు కింగ్ కొబ్రాలు ఎదురుదుగా డ్యాన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. దానిని చూసిన తర్వాత, ఇంటర్నెట్‌లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన పాము. ఈ భయంకర పాము.. ఒక నిమిషంలో మనిషిని చంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి కింగ్‌ కోబ్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి..

ఆహారం కోసం జనాల్లోకి రావడం చూసే ఉంటారు.. కానీ రెండు ఒకేజాతి పాములు డ్యాన్స్ చెయ్యడం ఎప్పుడూ చూశారా? బహుశా ఎప్పుడు చూసి ఉండరు..ఈ వైరల్ వీడియోలో మీరు రెండు కింగ్‌ కోబ్రాలు అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో కనిపించింది. రెండు కింగ్ కోబ్రాలు ఒకదానికొకటి పదగ విప్పి, బీన్ ట్యూన్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాయి. డ్యాన్స్ చేస్తూనే ఈ రెండు నాగుపాములు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటున్నాయి. అయితే వీడియో చూడగానే ఓ గ్రామం చుట్టు పక్కల సీన్ అని తెలిసింది.

పొలం దగ్గర కింగ్ కోబ్రా స్నేక్‌ను చూసిన స్థానిక వ్యక్తి తన మొబైల్ కెమెరాలో వీడియో రికార్డ్ చేశాడు. ఈ దృశ్యం చాలా ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్లు కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఒకప్పుడు పొదల్లో ఇలా పాములు ఆడుకుంటూ ఉంటాయి.. కానీ ఇప్పుడు ఇలా జనాలు తిరిగే ప్రాంతాల్లో చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేసినప్పటి నుండి, వీడియో వందల కొద్దీ లైక్‌లు, అనేక వ్యాఖ్యలను పొందింది. చాలా మంది ఈ వీడియోను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన కామెంట్స్‌ ఇచ్చారు. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆ వీడియో చూసి చాలా మంది థ్రిల్ అయ్యారు.. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీరు ఆ అద్భుతాన్ని ఒకసారి చూసేయ్యండి..