Site icon NTV Telugu

Viral : దేవుడా.. ఇదేం డ్రెస్.. నేనేక్కడా చూడలే..!

Bikini Girl

Bikini Girl

కొంతమంది పబ్లిసిటీ కోసమే.. పాపులారిటీ కోసమే కావాలని చేస్తారో లేక తెలియకుండానే చేస్తారో కానీ.. తమ పిచ్చి పనులు, చేష్టలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మెట్రో రైళ్లలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మెట్రో రైల్ లో కొందరు చేసే పనులు వైరల్ గా మారుతున్నాయి. తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రో రైల్లో ఓ యువతి చేసిన పని అందరినీ ఆశ్చర్యాన్నికి గురి చేసింది. ఓ యువతి బికినీలో హల్ చల్ చేసింది. బికినీ లాంటి డ్రెస్ లో యువతి ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Farmer : అధికారుల ముందే ప్రాణాలను తీసుకున్న అన్నదాత

ఢిల్లీ మెంట్రో రైల్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి బికినీ వంటి డ్రెస్ లో దర్శనం ఇచ్చింది. ఆ యువతి చేతిలో ఓ బ్యాగ్ ఉంది. ఆమె వేసుకున్న డ్రెస్ చాలా దారుణంగా ఉంది. బికినీ తరహాలో దుస్తులు ఉన్నాయి. తోటి ప్రయాణికుల్లో ఒకరు.. యువతిని వీడియో తీశారు. దాంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. సదరు యువతి డ్రెస్ చేసిన వారు అంతా అవాక్కయ్యారు. బాబోయ్.. ఇదేం డ్రెస్ అని విస్తుపోతున్నారు. కొందరేమో ఆ యువతిని తిట్టిపోస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి అసభ్యకరమైన దుస్తులు వేసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. యువతి తీరుని తప్పపడుతున్నారు. ఇంత పొట్టి పొట్టి డ్రెస్ లతో సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు అని మండిపడుతున్నారు.

Also Read : Zendaya: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన స్పైడర్ మాన్ హీరోయిన్… ‘జెండాయ’

వీడియో ఆధారంగా యువతిని గుర్తించి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ యువతి డ్రెస్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమైనా ఫారాన్ కంట్రీస్ అనుకున్నావా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే మరోవైపు ఎవరిష్టం వాళ్లది.. ఒకరిని అనే హక్కు మనకు లేదని కొందరు వాదిస్తున్నారు. ఆ యువతి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే మీకెందుకు అని ఎదురుదాడికి దిగుతున్నారు. వేసుకున్న డ్రెస్ లో కాదే చూసే చూపులో ఆలోచించే విధానంలో తప్పు ఉందని మరి కొందరు నెటిజన్స్ ఆ అమ్మాయికి సపోర్ట్ ఇస్తున్నారు.

Exit mobile version