NTV Telugu Site icon

Viral Video : ఇడ్లీలను ఇలా కూడా తింటారా?.. జనాలను చంపేసేయ్యండి రా బాబు..

food video

food video

సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు వైరల్ అవ్వగా, మరికొన్ని వీడియోలు జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.. ఆ వీడియోలు నెట్టింట ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాయి.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూసిన జనాలంతా కామెంట్ చెయ్యకుండా అస్సలు ఉండరు..

ఈ వీడియోలో ఇడ్లితో కొత్త ఆహార పదార్థాన్ని తయారు చేసే ప్రక్రియ మొత్తాన్ని చూపుతుంది. ఈ ప్రత్యేకమైన వంటకం చేయడానికి.. ఒక ఇడ్లీని తీసుకొని దానికి కొంత బంగాళాదుంప, సగ్గుబియ్యంతో తయారు చేసిన కూరని స్టఫ్ గా పెట్టి.. దానిని శాండ్‌విచ్ లా మరొక ఇడ్లితో కవర్ చేశాడు.. ఆ ఇడ్లీలను బజ్జీల పిండిలో వేసాడు.. బజ్జీలు చేసినట్లు మరుగుతున్న నూనెలో వేసాడు..

సాదారణంగా ఇడ్లీ చాలా హెల్తీ ఫుడ్.. వీటిని సాంబార్, కొబ్బరి చట్నీ, కారంపొడి, నెయ్యి వంటి వాటిని జోడించి తింటే ఆహా అనాల్సిందే.. రుచితో పాటుగా బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఇడ్లి అందరికి ఇష్టమైన ఆహార పదార్ధం. కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇడ్లి లో కూడా భిన్నమైన రకాలుగా తయారు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ గా నైనా, స్టార్ హోటల్స్ లో నైనా టిఫిన్ అంటే ఇడ్లి నే బెస్ట్.. అలాంటి ఇడ్లీని కూడా వదలకుండా విరక్తి కలిగిస్తున్నారని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇడ్లీతో తయారు చేస్తున్న ఓ వింత వంటకానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకి “ఇడ్లీ కాని ఇడ్లీ” అని టైటిల్ కూడా ఇచ్చాడు… ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేసుకోండి..