Site icon NTV Telugu

Viral Video: మీ ముఖాలు మండ.. శవాన్ని పట్టుకుని ఆ డ్యాన్స్ లేంట్రా బాబు

New Project (14)

New Project (14)

Viral Video: ఒక వ్యక్తి మరణించిప్పుడు అతని అంత్యక్రియలకు తనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ వస్తారు. ఈ సమయంలో అందరూ చనిపోయిన అతడి జీవితంలోని మధురానుభూతులను తలచుకుని నిష్క్రమణ బాధలో మునిగితేలుతుంటారు. ఆ వ్యక్తితో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు కూడా కన్నీరుమున్నీరవుతారు. కాగా కొందరు తమ సంతాపాన్ని తెలియజేసేందుకు వస్తారు. ఇలా ఒకరి అంత్యక్రియలకు హాజరయ్యే వ్యక్తులు సంబరాలు చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ప్రస్తుతం అటువంటి ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ఆశ్చర్యపోతారు.

Read Also:New Technology : ఇది చూడటానికి సూటుకేసే.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..

ఈ వైరల్ వీడియోలో మృతదేహాన్ని భుజాన వేసుకున్న వ్యక్తులు ఓ రేంజ్ లో డ్యాన్స్ చేయడం కనిపిస్తోంది. అంతిమయాత్రలో పాల్గొన్న వారంతా నవ్వుతూ కనిపిస్తారు. అంత్యక్రియల ఊరేగింపులో డీజే ఆడటం మీరు ఎప్పుడైనా చూశారా? ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ DJ బీట్‌లో వ్యక్తులు మృతదేహంతో డ్యాన్స్ చేయడాన్ని మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ అంత్యక్రియల ఊరేగింపులో DJ ప్లే చేయడమే కాదు, డ్రమ్మర్‌ని కూడా డ్రమ్స్ వాయించమని పిలుస్తున్నారు.

Read Also:CM YS Jagan: ఆ మత్స్యకారుల ఖాతాల్లో సొమ్ము జమ.. బటన్‌నొక్కి విడుదల చేసిన సీఎం జగన్‌

మృతదేహానికి నలుగురు వ్యక్తులు తమ భుజాలపై మోస్తున్నట్లు చూడవచ్చు. ఇంతమంది డెడ్ బాడీని భుజాలపై వేసుకుని ఐటెం సాంగ్ మోడ్లో డ్యాన్స్ చేయడం మొదలు పెడతారు. మరోవైపు, డ్రమ్మర్ కూడా విపరీతంగా డ్రమ్స్ వాయిస్తున్నాడు. ఎవరి పెళ్లినో, పుట్టినరోజునో జరుపుకుంటున్నట్లుగా ఉంది అక్కడి వాతావరణం. ఈ అంత్యక్రియల ఊరేగింపులో ఏ వ్యక్తి విచారంగా కనిపించలేదు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 92 లక్షల మందికి పైగా చూశారు.

Exit mobile version