NTV Telugu Site icon

Dengue Patient: డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్‌.. వీడియో వైరల్

Dengue Patient

Dengue Patient

Dengue Patient: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ కుటుంబం డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులుగా బత్తాయి జ్యూస్‌ను స్థానిక బ్లడ్ బ్యాంక్ సరఫరా చేసిందని ఆరోపించింది. దీనిపై విచారణ కూడా జరుగుతున్నట్లు తెలిపింది. బ్లడ్ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్‌ ఉన్నట్లు చూపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రాంతంలో డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా అవుతున్నట్లు వచ్చిన నివేదికలను పరిశీలించేందుకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ రాకేష్ సింగ్ వెల్లడించారు.

వైరల్‌ అయిన వీడియోలో ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్‌ ఆస్పత్రిలో స్కాం జరుగుతోందని ఓ వ్యక్తి తెలిపాడు.
ప్లాస్మా అవసరమైన రోగులకు బత్తాయి జ్యూస్ సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ వీడియోలో కనిపించిన బ్లడ్‌ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్‌ను పోలిన ద్రవం కనిపించింది. ఈ కారణంగానే డెంగ్యూ బారినపడిన రోగి చనిపోయాడని, ఆస్పత్రిపై చర్య తీసుకోవాలని ప్రయాగ్‌రాజ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Exam Chit Took Boys Life: పరీక్ష చిట్టీని లవ్ లెటర్ అనుకున్న అమ్మాయి.. బాలుడి హత్య

ఈ వైరల్‌ వీడియోపై యూపీ ఉపముఖ్యమంత్రి బ్రజేష్‌ పాఠక్‌ స్పందించారు. తాము ఓ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించామన్నారు. నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు, డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా చేయబడుతుందనే నివేదికలను పరిశీలించడానికి దర్యాప్తు బృందం ఏర్పాటు చేయబడిందని ఐజీ రాకేష్ సింగ్ అన్నారు. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. జ్యూస్ సరఫరా చేయబడిందా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదన్నారు.

Show comments