NTV Telugu Site icon

Viral Video : తలైవా పాటకు.. చెస్‌ ఛాంపియన్స్‌ స్టెప్పులు..

Chess Champions

Chess Champions

Viral Video : సంక్రాంతి పండుగకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిగా జరుపుకునే ఈ పంట పండుగను తమిళనాడులో పొంగల్‌గా 4 రోజుల పాటు జరుపుకుంటారు. పండుగ కోసం భారీ సన్నాహాల మధ్య, ఇక్కడ చెస్ ఛాంపియన్లు పొంగల్ వేడుకల సందర్భంగా డ్యాన్స్ చేసిన అందమైన వీడియో వైరల్ అవుతోంది. అవును, పొంగల్ వేడుకకు హాజరైన విశ్వనాథన్ ఆనంద్, డి. గుకేష్, ఆర్. ప్రజ్ఞానంద్.. ఇతర చెస్ ఛాంపియన్లందరూ పంచె ఉట్టు డ్యాన్స్ చేశారు.

ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జనవరి 12 ఆదివారం పొంగల్ సందర్భంగా ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ డి గుకేష్‌, ఆర్ ప్రజ్ఞానంద్‌, విదిత్ గుజరాతీ, సాగర్ షా పాల్గొన్నారు. ఈ చదరంగం క్రీడా తారలంతా పంచె కట్టులో తమిళ్‌ తలైవా రజినీకాంత్‌ వెట్టాయన్ సినిమాలోని ‘మనసిలాయో’ సాంగ్‌కు స్టెప్పులేశారు. దీనికి సంబంధంచిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Chesscom_in పేరుతో X ఖాతాలో భాగస్వామ్యం చేయబడిన ఈ వీడియోలో, చెస్ స్టార్లు విశ్వనాథన్ ఆనంద్, డి. గుకేష్, ఆర్‌. ప్రజ్ఞానంద్‌, విదిత్ గుజరాతీ.. సాగర్ షా తదితరులు కలిసి నిలబడి డాన్స్‌ చేయడం చూడవచ్చు. జనవరి 12న షేర్ చేయబడిన ఈ వీడియోకు 98,000 మంది వీక్షణలు.. అనేక కామెంట్‌లు వచ్చాయి. ఒక వినియోగదారు, “డ్యాన్స్ చాలా అందంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. ఇంకో యూజర్, “ఆహా.. చాలా బాగా డ్యాన్స్ చేసారు. చదరంగం తారల క్యూట్ డ్యాన్స్‌కి చాలా మంది తమ హృదయాలను హత్తుకుంది.

Show comments