సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించుకోవడం కోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. అందులో కొందరు సాహాసాలు చేస్తే మరికొందరు మాత్రం త్రిల్ పేరుతో పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు.. వాళ్లకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆకాశానికి, భూమికి మధ్య గాల్లో వేలాడుతూ లంచ్ చేస్తారు.. అందుకు సంబందించిన వీడియోనే ప్రస్తుతం జనాలను తెగ ఆకట్టుకుంటుంది..
రోప్ వేలో ఆకాశ వీధిలో అటూ ఇటూ కదులుతూ ఎంజాయ్ చేయడం చూస్తూ ఉంటాం. ఇలా మీరు చేయగలరా.. అంటే ఎందుకు చేయలేం అని టక్కున సమాధాంన ఇస్తారు. అయితే అదే రోప్ వేలో అత్యంత ఎత్తులో ఓ టేబుల్‍పై కూర్చుని భోజనం చేయమంటే మాత్రం వెంటనే ఆలోచనలో పడిపోతారు.. అయితే ఓ జంట మాత్రం దానికి సై అంది.. బ్రెజిల్‍లోని ఓ జలపాతం వద్ద 295 అడుగుల ఎత్తులో రోప్ వే ఏర్పాటు చేశారు.. అక్కడ ఫుడ్ ను తినడానికి ప్లాన్ చేశారు..
ఆ రోప్ కు డైనింగ్ టేబుల్ ను ప్లాన్ చేశారు.. అంతెత్తులో అందులో కూర్చుని భోజనం తింటూ ఎంజాయ్ చేయాలంటే మాత్రం అంతే.. అయితే అక్కడ కూర్చొని సీనరీని ఎంజాయ్ చేస్తూ తినాలంటే మాత్రం 15 నిముషాలకు 37 వేలకు పైగా చెల్లించాలట.. ఓ జంట డైనింగ్ టేబుల్‍పై కూర్చుని ఇష్టమైన ఫుడ్‌ని తింటూ ఏమాత్రం భయం లేకుండా ఎంజాయ్ చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.. ఈ వీడియో వైరల్ అవుతుండటం తో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. అంత ఎత్తులో తిన్నా, కింద తిన్న ఒక్కటే.. మరీ ఈ పిచ్చి ఏందో.. పడితే పరిస్థితి ఏంటి అంటూ ఎవరికి వచ్చింది వాళ్లు కామెంట్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో అయితే వైరల్ అవుతుంది..