Site icon NTV Telugu

Viral Video: భయంకర విన్యాసాలతో అదరగోట్టిన బైకర్స్.. ఏందీ భయ్యా ఇది..

Bike Stunts

Bike Stunts

టాలెంట్ ఉంటే ఏదైనా చెయ్యొచ్చు.. అని చాలా మంది తమ టాలెంట్ ను నిరూపించుకున్నార.. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు మరో వీడియో జనాలను అశ్చర్యానికి గురి చేసింది.. తాజాగా, బైకుపై యువకులు చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. మగధీర సినిమా లో బైకుపై హీరో చేసిన విన్యాసాన్ని.. ఈ యువకులు రియల్‌గా చేసి చూపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీగా కామెంట్స్ చెయ్యడంతో పాటు రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు..

యువకులు బైకులపై వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. చాలా మంది చుట్టూ నిలబడి ఆసక్తిగా తిలకిస్తుంటారు. ఇంతలో ఇద్దరు యువకులు చేసిన విన్యాసాలు చూసి అంతా నోరెళ్లబెట్టారు. బైకుపై వచ్చిన యువకులు.. ఒక్కసారిగా గాల్లోకి లేచారు. పైకి వెళ్లాక మధ్యలో ఉన్నట్టుండి బైకు హ్యాండిల్ వదిలేశారు. అలాగే పూర్తిగా వెనక్కు వచ్చి, బైకు వెనుక భాగాన్ని పట్టుకుని కొన్ని క్షణాలు వేలాడారు. ఆ వెంటనే మళ్లీ వేగంగా ముందుకు వెళ్లి బైకు హ్యాండిల్‌ను పట్టుకుని కిందకు చాలా సునాయాసనంగా ల్యాండ్ అవుతాడు.. ఆ వీడియో చూస్తున్నంత సేపు అందరు షాక్ అవుతూ చూస్తారు..

ఈ బైకు స్టంట్ మొత్తం క్షణాల్లో జరుగుతుంది.. ఈ యువకులు విన్యాసం చేస్తున్నంతసేపూ అక్కడున్న వారు ఊపిరి బిగపట్టి చూశారు. తర్వాత అంతా చప్పట్లతో వారిని అభినందించారు. ఈ ఘటన ను మొత్తం డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వీడియో ప్రస్తుతం లైకులు కామెంట్స్ తో ట్రెండ్ అవుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒక లుక్ వేసుకోండి.. గూస్ బంబ్స్ పక్కా వస్తాయి.. నిజంగా గ్రేట్ బాసూ..

Exit mobile version