మనలో ఎవరైనా సరే.. తేనెటీగల గుంపును చూస్తే ఆమడదూరం పరిగెడతాం. ఒకవేళ తేనటీగలు దాడి చేశాయంటే.. నొప్పి భరించలేనంతగా ఉంటుంది. మరికొన్నిసార్లైతే.. ప్రాణాలకు కూడా ముప్పువాటిల్లుతుంది. అందుకే ఏదైనా తేనెటీగల సమూహం కనిపిస్తే మనం వెంటనే రక్షణ చర్యలు తీసుకుంటాము. ఇకపోతే తాజాగా.. ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపు మైదానంలోకి దూసుకొచ్చింది.
Also Read: South Central Railway: ట్రైన్ లో అలా చేస్తున్నారా..? అయితే. ఆరు నెలల జైలు శిక్ష తప్పదు
ఆ దెబ్బకి అక్కడున్న క్రీడాకారులు, అంపైర్లు భయంతో మైదానంలో బోర్లా పడుకుండిపోయారు. అయితే ఆ తర్వాత తేనెటీగల గుంపు వెళ్లిపోయిన తర్వాత ఆటను లేచి మళ్లీ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతికి ఈ సంఘటన లంకాషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ భారత్ పర్యటనలో భాగంగా.. లంకాషైర్ జట్టు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మధ్య ప్రీ- సీజన్ టెస్ట్ మ్యాచ్ మంగళవారం నాడు మోదయ్యింది.
Also Read: Whatsapp UPI payments: నగదు పంపడం ఇక మంరింత సులభతరం చేసిన వాట్సాప్…!
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఎస్‌సీఏ తొమ్మిది వికెట్ల నష్టానికి 348 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుంది. ఈ సమయంలోనే తేనెటీగల సమూహం మైదానంలోకి దూసుకొచ్చింది. దీంతో గ్రౌండ్ లో కొద్దిసేపు భయాందోళనకు గురైన అంపైర్లు, క్రీడాకారులు వెంటనే మైదానంలోనే బోర్లా పాడుకోవాల్సింది వచ్చింది. అలా కొద్దిసేపటికి తేనెటీగల గుంపు మైదానం నుండి వెళ్లిన తరువాత క్రీడాకారులు ఊపిరిపీల్చుకొని మళ్లీ మ్యాచ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం తేనెటీగల గుంపు మైదానంలోకి వచ్చిన వీడియోలో అంపైర్లు, క్రీడాకారులు వాటినుంచి రక్షణ పొందేందుకు నేలపై పడుకున్న సమయంలో తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
Bee scared! 🐝 very scared!
.
.#FanCode #LancsOnTour pic.twitter.com/trucVDxks2— FanCode (@FanCode) March 19, 2024