Site icon NTV Telugu

Viral Video: ఛీ.. ఛీ.. అయ్యప్ప మాల వేసుకొని ఈ గలీజు పనేంటి స్వామి..!

Viral Video

Viral Video

Viral Video: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దీక్షల్లో అయ్యప్ప మాల ధారణ ఒకటి. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రారంభమయ్యే 41 రోజుల ఈ కఠిన వ్రతం భక్తులు స్వామి అయ్యప్పపై తమకు ఉన్న భక్తిని, నిష్టను చాటుకునేందుకు చేపడతారు. మాల ధరించిన ప్రతి భక్తుడు శారీరక, మానసిక పవిత్రతను పాటిస్తూ.. మద్యపానం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి పవిత్రమైన అయ్యప్ప మాలను ధరించి ఉన్న ఓ వ్యక్తి.. నిష్టకు పూర్తిగా విరుద్ధంగా రహస్యంగా మద్యం తాగుతూ తోటి స్వాములకు అడ్డంగా దొరికిపోయాడు.

Cyber Crime: వాట్సాప్ గ్రూప్‌లో వెడ్డింగ్ కార్డ్ పేరిట APK ఫైల్ ఫార్వార్డ్.. 100 మొబైల్ ఫోన్లు హ్యాక్..

ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే నిజంగా భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉంది. ఇక వైరల్ అవుతున్న వీడియోలో అయ్యప్ప మాల ధరించిన సదరు వ్యక్తి ఒక గదిలో కూర్చుని రహస్యంగా బీరు తాగుతుండగా.. అకస్మాత్తుగా తోటి స్వాములు గదిలోకి ప్రవేశించారు. వారిని చూడగానే మాల ధరించిన ఆ వ్యక్తి ఒక్కసారిగా కంగారుపడుతూ తాను తాగుతున్న బీర్ బాటిల్ ను కుర్చీ కింద దాచి పెట్టె ప్రయత్నం చేశాడు. అలాగే తన ముఖాన్ని దాచుకుంటూ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. తోటి స్వాములు అతడిని అడ్డుకున్నారు.

Hyderabad: మత్తు మందు జల్లి.. డబ్బులతో ఉడాయిస్తున్న దొంగ బాబాలు అరెస్ట్

ఇక అక్కడి తోటి మాలదారులు ఆగ్రహంతో.. “మనిషివా పశువువా? ఇదేం బుద్ధి తక్కువ వ్యవహారం? మద్యానికి దూరంగా ఉండలేకపోతే మాల తీసేయాలి.. అంతే తప్ప ఇదా పద్దతి?” అంటూ మండిపడ్డారు. ఈ సంఘటన మొత్తాన్ని తోటి భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడంతో భక్తులు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version