Site icon NTV Telugu

Viral: రొమాంటిక్ మూడ్‌ లోకి వచ్చిన గుర్రం.. చివరికి ఆమె చేసిన పనికి షాక్..!

Horse

Horse

మనుషుల లాగానే జంతువులకు కూడా అనేక రకాల ఎమోషన్లు ఉంటాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అచ్చం మనకి ఎలా స్నేహం, ప్రేమ, కోపం, విచారం లాంటి వివిధ భావోద్వేగాలను కూడా జంతువులు చక్కగా వ్యక్తపరచగలవు. జంతువులు తనకు నచ్చిన భాగస్వామితో మనుషులలాగే రొమాంటిక్‌ గా కూడా ఉంటాయి. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫన్నీ ఫ్రాంక్ వీడియో బాగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ గుర్రం ఇచ్చిన ఎమోషన్ నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.

Read Also: BRS Aroori Ramesh: ఆరూరి రాజీనామా ప్రకటన.. హనుమకొండలో పొలిటికల్‌ హై డ్రామా..

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి గుర్రం మొఖం కలిగిన ఓ మాస్క్ ధరించి ఆ గుర్రం దగ్గరకు వెళ్లింది. ఇంకేముంది పాపం ఆ గుర్రం.. తన దెగ్గరికి నిజమైన గుర్రం వచ్చిందని రొమాంటిక్ మూడ్‌ లోకి వెళ్లింది. అదే ఆవేశం, ఉత్సుకతతో ఆ మాస్క్ పై ముద్దు పెట్టింది. ఆ తర్వాత మాస్క్ ధరించిన మహిళ తన మాస్క్‌ ను బయటకు తీయడంతో.. ఒక్కసారిగా ఆ గుర్రం షాకైంది. దాంతో వెంటనే ఆ గుర్రం వెనక్కి తిరిగి పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వైరల్ వీడియోకు ఏకంగా 10 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. పది లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేయడమే కాకుండా.. నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపించారు. కామెంట్స్ లో ఆ గుర్రం ఎంతో ఆశపడిందో.. ఇది చాలా పెద్ద పాపం., ఆ గుర్రాన్ని దారుణంగా మోసం చేశారని ఒకరు అనగా, మరొకరు ఆ గుర్రం ఆవేశం మొత్తం చల్లార్చేసారు అన్నారు. మరొకరైతే `ఆ గుర్రానికి పెద్ద కరెంటు షాక్ కొట్టింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

Exit mobile version