Site icon NTV Telugu

Viral Video: ఈగకు ట్రైనింగ్ ఇచ్చిన ఘనుడు.. వీడుడెవడో రాజమోళిని మించేసాడుగా..!

13 Fl

13 Fl

రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను ప్రపంచవ్యాప్తంగా చాలామందే చూసే ఉంటాం. అందులో గ్రాఫిక్స్ టెక్నాలజీని వాడుకొని ఈగ చేసే అనేక సీన్లను స్క్రీన్ పై చూసాం. కాకపోతే అది సినిమా.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం నిజంగా మనకి మతి పోవాల్సిందే. ఒక మనిషికి ట్రైనింగ్ ఇచ్చి కొత్త విషయాలను నేర్పించడం అంటేనే ఎంతో కష్టం. అలాగే పిల్లులు, కుక్కలు, పక్షులకు కూడా కాస్త కష్టమైన సరే ట్రైనింగ్ ఇచ్చి కొన్ని పనులను నేర్పిస్తాము. అలాంటిది ఊహించిన విధంగా ట్రైనింగ్ ఇచ్చాడు ఘనుడు. ముట్టుకుంటే ఎగిరిపోయే ఈగకు ట్రైనింగ్ ఇచ్చాడంటే నిజంగా నమ్మశక్యం కాని విషయమే. కాకపోతే ఈ వీడియో చూస్తే మాత్రం దాన్ని ఒప్పుకోకుండా ఉండలేము.

Also read: Jadeja – Ashwin: ఆ విషయంలో అశ్విన్‌ పై ఫన్నీ కామెంట్స్ చేసిన జడేజా..!

ఈ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. ఓ వ్యక్తి ఈగను తను చెప్పినట్లుగా చేసేలా ట్రైన్ చేశాడు. నిజానికి ఆ వ్యక్తి ఈగకు ఊహించని ట్రైనింగ్ ఇచ్చాడు అంటే నమ్మండి. వీడియోలో ఉన్న వ్యక్తి తన వేలును ఎటువైపు ఆనిస్తే.. ఈగ కూడా ఆ చేతి వేలి వెంటనే అక్కడికి వాలడం మొదలు పెడుతుంది. అంతేకాదండోయ్.. ఓ తేలికపాటి నాణ్యంను దాని ముందు నిలబెడితే.. ఆ నాణ్యంను ముందుకు దొర్లించుకుంటూ వెళ్ళింది. అయితే ఈ వీడియోకి ఎవరైనా శిక్షణ ఇలా ఇవ్వచ్చు అంటూ క్యాప్షన్ జత చేయడం నిజంగా కోసమెరుపు.

Also Read: Viral Video: ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి థాట్స్.. ఏసీ నీటిని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా..?

ఇకపోతే ఈ వీడియో చూసిన నెటిజెన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అసలు మనం చూస్తున్నది నిజమా.. లేక గ్రాఫిక్స్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరైతే తాము లాంటిది ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు. మరికొందరైతే ఆశ్చర్యపోయి నిజంగా ఇలాంటిది సాధ్యమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఔత్సాహికులు మాత్రం దీనిని ఏఐ టెక్నాలజీ వాడి రూపొందించారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version