NTV Telugu Site icon

Viral Video: ఒక్కసారిగా ఇంట్లో ఎగిసిన మంట.. పిల్లాడి సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం..

Viral Video Boy

Viral Video Boy

ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇందులో చాలావరకు ఫన్నీ వీడియోలు ఉంటాయి., మరికొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అనుకోకుండా ఇంట్లో స్విచ్ బోర్డు దగ్గర మంట రాగా ఆ పిల్లాడు తన సమయస్ఫూర్తితో పెను ప్రమాదం నుండి బయట పడేసాడు. ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Ind vs Pak: వామ్మో.. ఒక్క టికెట్ ధర 17 లక్షలు.. ఇండో – పాక్ మ్యాచ్ ..

ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే.. వీడియోలో ఓ పిల్లోడు ఒక్కడు టీవీ చూస్తున్నాడు. అలాగే మిగతా కుటుంబ సభ్యులందరూ కాస్త దూరంగా మరోవైపు అందరూ ఒకే దగ్గర కూర్చొని ఏదో పార్టీ చేసుకుంటున్నారు. అయితే పిల్లవాడు టీవీ చూస్తున్న సమయంలో ఒక్కసారిగా స్విచ్ బోర్డు దగ్గర పెద్దగా మంటలు వచ్చాయి. దానితో అతడు వెంటనే తన కుటుంబ సభ్యుడి దగ్గరికి వెళ్లి అక్కడ విషయం చెప్పి అక్కడకు రమ్మని చేయి పెట్టి లాగిన అతడు వినకుండా పార్టీలో మునిగిపోయాడు. అయితే ఆ పిల్లోడు వెంటనే సమయస్ఫూర్తితో టీవీ కింద ఉన్న ఓ స్ప్రే ని ఉపయోగించి మంటలపై స్ప్రే చేశాడు.

T20 WC Winners List: టీమిండియా ఈసారైనా వరల్డ్ కప్ గెలుస్తుందా..? 2007-2024 విన్నర్స్ లిస్ట్

దీంతో మంటలు అదుపులోకి వచ్చింది. దీంతో నిజంగా పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ వైరల్ వీడియోను చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులపై భిన్నాభిప్రాయాలు కామెంట్ చేస్తున్నారు. వారు తల్లిదండ్రుల పోస్టుకి పనికిరారంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.., మరికొందరైతే ఆ పిల్లాడి సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు.