Site icon NTV Telugu

Viral Post: ప్రజలను యాప్స్ నిలువు దోపిడీలు చేస్తున్నాయా..? ఇదిగో ప్రూఫ్..

Viral Post

Viral Post

Viral Post: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చేతులోని స్మార్ట్ మొబైల్ వాడి ఏ పనినైనా ఉన్నచోట నుంచే చేసుకునేలా పరిస్థితులు మారిపోయాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా పట్టణాలు, నగరాలలో ప్రజలు ప్రయాణించడానికి ఉపయోగించే రవాణా మార్గాల ఎంపిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓలా, ఉబర్, రాపిడో ఇలా పేరు వేరైనా కంపెనీలు ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నాయని అర్థమవుతోంది. బయట చూడడానికేమో.. తాము ఆఫర్లు ఇస్తున్నాము అంటూ ప్రకటనలు చేస్తున్న, లోపల మాత్రం ప్రజలను దోపిడీ చేసేలా వారి పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మహిళ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also:KTR: సీఎం వేస్తారేమో అనుకున్నాం.. ఢిల్లీకి వెళ్లారు.. డిప్యూటీ సీఎం, వ్యవసాయ మంత్రి ఎవరైనా రండి చర్చిద్దాం

బెంగళూరు నగరంలో ఉంటున్న అదితి శ్రీనివాస అనే యువతీ.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేసింది. ఇందులో ఆమె బెంగళూరులో నివసిస్తున్న వారు మీ దగ్గర వాహనం లేకపోతే బలైపోతారు అంటూ పోస్ట్ చేసింది. ఆమె చేసిన పోస్ట్ ఆధారితంగా చూస్తే 2.6 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఆటోమీటర్ లో కేవలం రూ.39 చూపించగా.. అదే ఉబర్ యాప్ లో ఏకంగా 172 రూపాయలకు పైన చూపించడం కనిపిస్తుంది. ఈ రెండిటికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ యాప్స్ పై మండిపడుతున్నారు.

Read Also:Prasanna vs Prashanthi: పీహెచ్‌డీ పాలిటిక్స్‌..! నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కలకలం

నిజానికి ఉబర్ చార్జీలు డిమాండ్-సప్లై ఆధారంగా మారుతూ ఉంటాయి. ట్రాఫిక్, వాతావరణ పరిస్థితుల మధ్య ఈ రేటు మారడం కనబడుతూ ఉంటుంది. కేవలం ఉబర్ మాత్రమే కాదు.. ఏ యాప్ అయినా సరే ఇలాంటి చార్జీలు వ్యత్యాసం కనబడుతూనే ఉంటుంది. అయితే, ఆటోమేటర్ రేట్లు మాత్రం ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. నిజానికి గత కొన్ని రోజులగా ఉబర్ రేట్లు మీటర్ చార్జి కి దగ్గరగా కనిపిస్తున్నా.. రైడర్లు మాత్రం రైడును యాక్సెప్ట్ చేయటం లేదు. ఓలా, నమ్మ యత్రి యాప్స్ మాత్రమే కన్ఫర్మ్ చేస్తున్నారు. అందులో కూడా మీటర్ రేటు కంటే 60 నుంచి 70 రూపాయలకు పైన ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే వాహన చోదకులు ప్రజలపై పెను భారాన్ని మోపుతున్నట్లు ఇట్టే స్పష్టం అవుతుంది. చూడాలి మరి ఈ యాప్స్ పై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు ముందు ముందు చేపడతాయో.

Exit mobile version