NTV Telugu Site icon

Viral News: కొబ్బరిబొండాలను తాగేవారికి హెచ్చరిక.. ఇది మీ కోసమే..

Coconut Sales An

Coconut Sales An

వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలామంది దాహన్ని తీర్చుకోవడానికి నిమ్మకాయ నీళ్లు, లేదా కొబ్బరిబొండాలను ఎక్కువగా తాగుతుంటారు.. వీటిలో ఎక్కువగా పోషకాలు ఉండటం వల్ల ఎక్కువ మంది వీటిని తాగాడానికి ఇష్టపడతారు.. ఒక్క వేసవి లో మాత్రమే కాదు ప్రతి కాలంలో కూడా కొబ్బరి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వైద్యులు సైతం జ్వరం బారిన పడినా, నీరసం, వడదెబ్బ వంటి అనారోగ్య సమస్యలకు కొబ్బరి బొండాలు బాగా తాగించాలని సూచిస్తుంటారు. ఇంకా అనేక అనారోగ్య సమస్యల ను దూరం చేసే కొబ్బరి బొండాలను వేసవిలో ఎక్కువగా తాగడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు జనాలు..

 

ఎటువంటి అనారోగ్యం వచ్చినా కూడా వీటిని జనాకు ఎక్కువగా తాగుతారు. అందుకే ఏ కాలంలో అయిన డిమాండ్ ఎక్కువే.. అయితే, కొబ్బరి బొండాలు అమ్ముకుంటున్న ఒక వ్యక్తి చేసిన పని తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా కోపంతో రగిలిపోతారు.. వీలైతే అతను కనిపిస్తే కొడతారు కూడా అలా చేసి మనుషుల ఆరోగ్యంతో ఆడుకున్నాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న వీడియోలో కొబ్బరి బోండాలను అమ్మే వ్యక్తి తన బండిపై ఉన్న లేత కొబ్బరి బోండాలపై డ్రైయిన్‌ వాటర్‌ చల్లుతున్నట్లు కనిపిస్తుంది..

 

ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందని 28 ఏళ్ల సమీర్‌గా గుర్తించారు. వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి కొబ్బరి బొండాలను కూడా వదలకుండా ఇలా చేస్తున్నారా అంటూ ఒకింత ఆశ్చర్యపోతున్నారు.. మనుషుల ప్రాణాల తో ఆడుకుంటున్న ఇలాంటి వారిని అస్సలు వదలకూడదు.. కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఆ వీడియోను మీరు ఒకసారి చూసి తరించండి..

Show comments