Site icon NTV Telugu

Viral News: ఈ అందమైన ప్రాంతంకు వెళ్లాలంటే ఆపరేషన్ తప్పనిసరి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

Cool Place

Cool Place

ఈ ప్రకృతి చాలా అందమైంది.. ఎన్నో అందాలను తనలో దాచుకొని ఉంటుంది.. ఎన్నో అద్భుతాలను కలిగి ఉంటుంది.. విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరిగా ఉండాలి.. లేకుంటే మన దేశం దాటి పోలేము..ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌ కూడా చూపించాలి. అయితే కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాలంటే స్పెషల్‌గా రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.. ఇప్పుడు మనం చెప్పుకొనే ప్రాంతానికి వెళ్లాలంటే ఆఫరేషన్ చేయించుకోవాలని అంటున్నారు.. ఇదేం విచిత్రం అనుకుంటున్నారు కదు.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఈ ప్రపంచంలో ఆ ప్రాంతం ఎక్కడుంది.. ఎటువంటి ఆపరేషన్ చేయించుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అంటార్కిటికాలోని విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ అనే చిన్న పట్టణం ఉంది. ఎండాకాలంలో ఇక్కడ కేవలం 100 మందిలోపు ప్రజలు ఉంటారు. శీతాకాలం వస్తే ఆ వంద మందిలో సగం మంది సర్దుకుని వెళ్ళిపోతారు.. ఆ ప్రాంతంలో అంత చలిగా ఉంటుందని అర్థం.. ఈ గడ్డకట్టిన ఖండంలో ఉన్న రెండు జనజీవన పట్టణాలలో విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ ఒకటి.. ఇది విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ కింగ్ జార్జ్ ద్వీపంలో ఉంది.. ఈ విల్లాస్ చీలి భూభాగంలోకి చోచ్చుకొని ఉంటుంది..

అక్కడికి వెళ్లాలంటే సర్జరీ ఎందుకు చేయించుకోవాలి అంటే?

అక్కడ చలితో కూడిన ప్రాంతం.. సైనిక సిబ్బంది, వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులలో పనిచేసే పరిశోధకులు వస్తుంటారు. వారిలో కొందరు కుటుంబాలను వెంట తీసుకువస్తారు. కానీ వారు వచ్చే ముందు తప్పనిసరిగా అపెండెక్టమీ చేయించుకోవాలి. అంటే ఆపరేషన్ చేయించుకొని అపెండిక్స్ తొలగించుకోవాలి.కారణం ఏంటంటే.. స్పెషలిస్ట్ సర్జన్ ఉన్న సమీప ఆసుపత్రి 1,000 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉంది. దాన్ని చేరుకోవాలంటే దక్షిణ మహాసముద్రం మీదుగా వెళ్లాలి. ఆ మహాసముద్రం చాలా భయంకరంగా మారుతుంటుంది.. అలాంటి పరిస్థితులలో అక్కడికి వెళ్లడం కష్టం అందుకే ముందే చేయించుకొని రావాలని చెబుతున్నారు..

ఇకపోతే ఆ ప్రాంతంలో ఆడవాళ్లు గర్భం దాల్చరు. ఎందుకంటే ఇది తల్లి, బిడ్డకు చాలా ప్రమాదకరం. స్థానిక వన్యప్రాణులకు వ్యాధులను వ్యాపింపజేసే అవకాశం ఉందనే కారణంతో కుక్కలను పెంచుకోవడానికి అనుమతి ఇవ్వరు. మెయిన్‌ల్యాండ్ నుంచి ఎప్పుడో ఒకసారి వచ్చే షిప్‌మెంట్స్‌లోని కూరగాయలతోనే బతకాల్సి ఉంటుంది… అలాంటి ప్రాంతానికి వెళ్లక పోవడమే మంచిది చాలా మంది అనుకోవడం సహజమే.. ఏంటో ఈ పిచ్చి..

Exit mobile version