ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న ఆఫ్ఘాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మరోసారి కోహ్లీ ఫ్యాన్స్ పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ప్లేఆఫ్స్ లో భాగంగా బుధవారం రాత్రి లక్నో-ముంబై మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో ఓడిన తర్వాత నవీన్ ను నెటిజన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. అతడిని ట్రోల్ చేస్తున్నారు. నవీన్ ఉల్ హక్ ను ముంబై ప్లేయర్స్ తో పాటు జొమాటో, స్విగ్గీలు కూడా ఆటాడుకున్నాయి.
Also Read : GVL Narasimha Rao: కేంద్రం నిధులు ఇస్తే ఎందుకు అని అడగడం విడ్డూరమే..
అయితే లక్నో-ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీతో గొడవపడ్డ నవీన్ ఆ తర్వాత చేసిన రచ్చ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబై-ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ ఔటయ్యాక.. ముంబై మ్యాచ్ ను చూస్తూ.. ఓ గిన్నెలో మామిడి పండ్లను షేర్ చేస్తూ.. స్వీట్ మ్యాంగోస్ అని నవీన్ ఉల్ హక్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇక అప్పటి నుంచి అతన్నీ.. కోహ్లీతో పాటు దాదాపు ప్రతీ ఇండియన్ ఫ్యాన్ ట్రోలింగ్ చేస్తున్నాడు. నిన్న ముంబైతో మ్యాచ్ లో నవీన్.. నాలుగు వికెట్లు తీసిన తర్వాత కేఎల్ రాహుల్ స్టైల్ లో సెలబ్రేషన్స్ చేసుకోవడం మరింత కోపం తెప్పించింది.
Also Read : Sengol History: ‘సెంగోల్’ రాజదండం ఎక్కడ ఉంది? పార్లమెంటులో పెట్టాల్సిన అవసరం ఏముంది?
ఈ మ్యాచ్ లో లక్నోను ముంబై ఇండియన్స్ ఓడించిన తర్వాత అభిమానులు మాత్రం నవీన్ పై ట్రోలింగ్ కు దిగారు. నవీన్ ను మామిడి పండ్లు అమ్ముతున్న వాడిగా మీమ్స్ క్రియేట్ చేసి ఓ ఆట ఆడుకుంటున్నారు. ముంబై-లక్నో మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై ఆటగాళ్లు కుమార్ కార్తీకేయ, విష్ణు వినోద్, సందీప్ వారియర్ లు కూడా ఓ టేబుల్ ముందు మామిడి పండ్లను పెట్టి ‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు’ అన్న స్టైల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది.
Also Read : 2000Note : 2000నోట్లను వదిలించుకునేందుకు జనం తిప్పలు.. భారీ ఆఫర్లు ప్రకటిస్తున్న వ్యాపారులు
ఇక నవీన్ ఉల్ హక్ ను కోహ్లీ ఫ్యాన్స్ తో పాటు ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా ట్రోల్ చేశాయి. జొమాటో.. తన ట్విటర్ హ్యాండిల్ లో నవీన్ బ్యాటింగ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసి ‘నాట్ సో స్వీట్ మ్యాంగోస్’ అని పోస్ట్ పెట్టింది. స్విగ్గీ కూడా మామిడి పండ్లను కట్ చేసిన ఫోటోను షేర్ చేస్తూ ట్రోల్ చేసింది. కోహ్లీ ఫ్యాన్స్ పుణ్యమా అని ఎప్పుడు ఇంత ఫేమస్ కాని నవీన్.. ఈ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాడు. హ్యాష్ ట్యాగ్ నవీన్ తో పాటు స్వీట్ మ్యాంగోస్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.