మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు గత నెలన్నర రోజులుగా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇక కుకీ-మెటీ వర్గీయుల మధ్య వివాదంతో రాష్ట్రం అట్టుడికిపోతుంది. దీంతో గత రాత్రి ఇంఫాల్ పట్టణంలో బీజేపీ నేతల ఇళ్లను తగులబెట్టేందుకు ప్రయత్నించిన దుండగులపై భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి. దీంతో ఈ ఘర్షణలో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా-చురచంద్‌పూర్ జిల్లాలోని కంగ్వాయ్ లో అర్థరాత్రి కాల్పులు జరిగాయి.
Also Read: Gold Bond: రూ. 5,926కి గోల్డ్ బాండ్ ఇస్తున్న ప్రభుత్వం.. సోమవారం నుంచి షురూ
శుక్రవారం రాత్రి ఆర్మీ, అస్సాం రైఫిల్స్ మరియు మణిపూర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రాష్ట్ర రాజధాని గుండా అర్ధరాత్రి వరకు ఉమ్మడి కవాతు నిర్వహించి అల్లర్లు జరుగకుండా అడ్డుకున్నారు. ఇంఫాల్ వెస్ట్‌లోని ఇరింగ్‌బామ్ పోలీస్ స్టేషన్ లోని ఆయుధాలను దోచుకోవడానికి కొందరు దుండగులు ప్రయత్నించారు. అయితే.. దాదాపు 1,000 మందితో కూడిన ఓ గుంపు ప్యాలెస్ కాంపౌండ్ సమీపంలోని బిల్డింగ్ లపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు గుంపును చెదరగొట్టడానికి RAF టియర్ గ్యాస్- రబ్బరు బుల్లెట్లను ప్రయోగించింది. ఎమ్మెల్యే బిశ్వజీత్ ఇంటికి నిప్పు పెట్టేందుకు మరో గుంపు ప్రయత్నించింది. అయితే అస్సాం రైఫిల్స్ బృందం ఆ గుంపును చెదరకొట్టింది.
Also Read: Ration Dealership: తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం.. రేషన్ డీలర్‌షిప్ వయసు పరిమితి పెంపు
అయితే సింజెమాయి వద్ద అర్ధరాత్రి బీజేపీ కార్యాలయాన్ని మరో గుంపు చుట్టుముట్టింది. దీంతో ఆర్మీ సిబ్బంది వారిని చెదరగొట్టారు. ఈ ఘర్షణలో ప్రాణహాని జరుగలేదని భద్రతా సిబ్బంది తెలిపింది. అదేవిధంగా.. ఇంఫాల్‌లోని పోరంపేట సమీపంలోని బీజేపీ (మహిళా) అధ్యక్షురాలు శారదా దేవి ఇంటిని అర్ధరాత్రి ధ్వంసం చేయడానికి వచ్చిన యువకులను భద్రతా బలగాలు చెదరగొట్టాయి.