NTV Telugu Site icon

Manipur Violence: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు..!

Manipur

Manipur

Manipur Violence: మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు మే 3న ప్రారంభించిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. దీంతో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆ రాష్ట్రంలో సందర్శించి.. రాష్ట్రంలోని అన్ని వర్గాల నేతలతో మాట్లాడినప్పటికీ పరిష్కారం సద్దుమనుగడం లేదు. తాజాగా శుక్రవారం రాత్రి ఆటోమేటిక్ తుపాకులను ధరించి.. బిష్ణుపూర్ జిల్లాలోని క్వక్ట, చురాచాంద్‌పూర్‌లోని కంగ్వాయ్ ప్రాంతాల్లో కాల్పులు జరిపారు. శనివారం తెల్లవారుజాము వరకు కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి.

Read Also: Bullet Bike: దారుణం.. బుల్లెట్‌ బైక్‌ కట్నంగా ఇవ్వలేదని విషమిచ్చి చంపేశారు..

ఈ నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులపై దాడులు చేసి వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. సుదీర్ఘమైన జాతి హింస ఫలితంగా క్యాబినెట్ మంత్రులతో సహా పలువురు ప్రజా ప్రతినిధులు దాడికి గురయ్యారు. ఈ హింస ఘటనలో బిజెపి నాయకుల నివాసాలను ధ్వంసం చేసి.. దాడికి ప్రయత్నించారు. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి ఆర్‌.కె రంజన్ సింగ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఇటీవల ఆకతాయిలు బీజేపీ నేతల ఇళ్లను తగులబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారిని ఆర్మీ సిబ్బంది చెదరగొట్టడంతో ఎటువంటి హాని జరగలేదు.

Read Also: Adipurush: ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు… రికార్డులు ఏమైనా మిగిలాయా?

ఇంఫాల్‌లోని కేంద్ర విదేశీ వ్యవహారాలు మరియు విద్యా శాఖ సహాయ మంత్రి ఆర్‌కె రంజన్ సింగ్ నివాసానికి గురువారం (జూన్ 15) రాత్రి కొందరు నిప్పు పెట్టారు. అంతకుముందు మే 23న కూడా రంజన్ సింగ్ నివాసంలోకి కొందరు ప్రవేశించారు. అయితే భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టారు. అంతేకాకుండా సింగ్ ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. అంతేకాకుండా మణిపూర్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి నెమ్చా కిప్‌జెన్ అతని నివాసానికి నిప్పు పెట్టారు. అయితే ఆమె లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమె అధికారిక నివాసాన్ని తగలబెట్టారు.

Read Also: Double Hat-Trick: క్రికెట్‌లో అరుదైన రికార్డు.. ఒకే ఓవర్లో రెండు హ్యాట్రిక్‌లు! సంచలనం సృష్టించిన 12 ఏళ్ల కుర్రాడు

మణిపూర్ మంత్రివర్గంలో కిప్‌జెన్ మహిళా ప్రజా ప్రతినిధిగా కొనసాగుతున్నారు. హింసాకాండ మధ్య కుకీ-జోమి-చిన్-హ్మార్ కమ్యూనిటీల కోసం 10 మంది కుకీ చట్టసభ సభ్యులలో ఆమె ప్రత్యేక పరిపాలనను కోరారు. మరో మంత్రి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి గోవిందాస్ కొంతౌజం ఇంటిని కూడా మే 24న ధ్వంసం చేశారు. ఇంఫాల్‌లోని రాష్ట్ర మంత్రి టి. బిశ్వజిత్ సింగ్ నివాసంపై మరో కొందరు దాడికి ప్రయత్నించారు. థాన్లోన్ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యేపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఆ తర్వాత వాల్టే తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతున్నారు.