మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ ఏడాది వరుస సినిమాలతో అలరిస్తున్నారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా ప్రజంట్ ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన పీరియాడిక్ డ్రామా ‘వృషభ’తో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. గతాన్ని, వర్తమానాన్ని ముడిపెడుతూ సాగే ఇంట్రెస్టింగ్ టైమ్ లైన్ సీన్స్‌తో ట్రైలర్‌ను మేకర్స్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.
Also Read : Radhika Apte: డబ్బు కోసమే చేశా.. కానీ ఆ భయం ఇప్పటికీ వెంటాడుతోంది
కాగా ట్రైలర్ ప్రకారం చూసుకుంటే.. వృషభ మహారాజుగా మోహన్ లాల్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్‌కు కనువిందు కలిగిస్తుండగా, యాక్షన్ సీక్వెన్స్ మరియు గ్రాండ్ విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో కనిపిస్తున్నాయి. మోహన్ లాల్ కొడుకు పాత్రలో సమర్ జిత్ లంకేశ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. పాన్ ఇండియా నటీనటులు, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, సాలిడ్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా రూపొందించిన ఈ చిత్రం, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.
