Site icon NTV Telugu

Vinesh Phogat: కోర్టు తీర్పుపై వినేష్ ఫోగట్ పోస్ట్ వైరల్..

Vinesh Phogat

Vinesh Phogat

Vinesh Phogat: ఒలింపిక్ పతకం సాధించాలన్న వినేష్ ఫోగట్ కల చెదిరిపోయింది. ఆమెకి కంబైన్డ్ రజత పతకాన్ని ఇవ్వాలన్న అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తిరస్కరించింది. దింతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఇప్పుడు మరికొన్ని దారులను అన్వేషిస్తోంది. అయితే సీఏఎస్ నిర్ణయం ఈ వ్యవహారానికి ఒక విధంగా ముగింపు పలికింది. ఈ కేసు మొత్తం దేశానికి, రెజ్లింగ్ ప్రపంచానికి చాలా ముఖ్యమైనది.

Gold Rate Today: పండగ వేళ పెరిగిన పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

CAS నిర్ణయం తర్వాత వినేష్ ఫోగట్ మొదటిసారి తన స్పందనను తెలియజేశారు. ఈ 29 ఏళ్ల రెజ్లర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చింది. ఈ పోస్ట్ లో, ఆమె తలపై చేతులు పెట్టుకుని చాప మీద పడిపోయిన ఫోటోను షేర్ చేసింది. అయితే ఆ ఫొటోకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. చిత్రాన్ని చూస్తున్నప్పటికీ ఆమె నొప్పితో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ చిత్రం ఆమె ప్యారిస్ ఒలింపిక్ ఆటలలో అత్యుత్తమ దశకు చెందినది. మహిళల 50 కిలోల రెజ్లింగ్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ యుయి సుసాకిని ఓడించిన తర్వాత ఈ చిత్రం తీయబడింది.

Exit mobile version