Site icon NTV Telugu

Vinesh Phogat: వినేశ్ ఫోగట్కు ఊరట..

Vinesh

Vinesh

100 గ్రాముల అదనపు బరువుతో ఒలింపిక్ ఫైనల్కు అర్హత కోల్పోయిన వినేష్ ఫోగట్కు ఊరట లభించింది. సిల్వర్ మెడల్ పొందేందుకు వినేశ్ అర్హురాలేనని పారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. ఆమె సిల్వర్ మెడల్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చునని అభిప్రాయపడింది. తనపై అనర్హత వేస్తూ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పారిస్ స్పోర్ట్స్ కోర్టులో వినేశ్ సవాల్ చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వినేశ్ తరుఫున నలుగురు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

Read Also: Serial Killer: చెరుకు తోటల్లో చీరతో ఉరేసి..యూపీలో సీరియర్ కిల్లర్..? 9 మంది మహిళల హత్య..

ఇదిలా ఉంటే.. వినేశ్ ఫోగాట్‌కు సిల్వర్ పతకం ఇవ్వాలని ప్రముఖ అమెరికన్ ఫ్రీస్టైల్ రెజ్లర్ జోర్డాన్ బరోస్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆమె సిల్వర్ మెడల్‌కు అర్హురాలని అన్నారు. జోర్డాన్ బరోస్ ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్ గెలిచారు. 2012లో లండన్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం సాధించాడు. అంతేకాకుండా.. వినేశ్ ఫోగట్కు చాలా మంది అండగా నిలుస్తున్నారు. మరోవైపు.. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆమెపై అనర్హత వేటు వేసినందుకు.. ఆమె రెజ్లింగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించింది. కాగా.. ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.

Read Also: Committee Kurrollu: వారసత్వం ఉంది కదా అని సినిమాల్లోకి వస్తే సక్సెస్ అవ్వలేరు: నిహారిక కొణిదెల ఇంటర్వ్యూ

మరోవైపు.. రెజ్లర్ వినేష్ ఫోగట్ కి హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటిచింది. ఆమెకు 4 కోట్ల రూపాయల నజరానా ఇచ్చింది హర్యానా ప్రభుత్వం. వినేష్ ను ఛాంపియన్ గా పరిగణిస్తూ.. నజరానా ఇస్తున్నట్లు తెలిపింది. తమ రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్ లో గోల్డ్ గెలిస్తే 6 కోట్లు, సిల్వర్ గెలిస్తే 4 కోట్లు, కాంస్యం గెలిస్తే 2.5 కోట్లు ఇస్తామని ముందుగానే ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. వినేష్ ను సిల్వర్ మెడల్ విన్నర్ గా భావిస్తూ… 4 కోట్లు నజరానా ఇస్తున్నామని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.

Exit mobile version